ఈ ప్ర‌పంచంలో చాలా మంది తండ్రికి త‌గ్గ త‌న‌యులో లేదా తండ్రిని మించిన త‌న‌యులో ఉంటారు. తండ్రి ఒక రంగంలో రాణించిన‌ప్పుడు వారి కుమారులు కూడా అదే రంగాన్ని ఎంచుకుని స‌క్సెస్ అయిన‌ప్పుడే అస‌లు సిస‌లు మ‌జా ఉంటుంది...ఆ వార‌సుడిని తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనో లేదా తండ్రిని మించిన త‌న‌యుడో అని పిల‌వాలి. అయితే తండ్రి బ‌హుముఖ ప్రజ్ఞాశాలి అయిన‌ప్పుడు వార‌సుడు కూడా అదే తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని తండ్రిలాగే అన్ని రంగాల్లో రాణించ‌డం నిజంగా గొప్ప విష‌యం. ఇది దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, న‌ట‌ర‌త్న ఎన్టీఆర్‌కు, ఆయ‌న త‌న‌యుడు యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌కు క‌రెక్టుగా స‌రిపోతుంది.

 

ఎన్టీఆర్ తెలుగు సినిమా రంగంలో చేసిన పాత్ర‌లు ఎప్ప‌ట‌కి చెక్కు చెద‌ర్లేదు. అందుకే ఎన్టీఆర్ తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఓ రాముడు, ఓ కృష్ణుడుగా కొలువైయ్యాడు. ఇక తండ్రి న‌ట వార‌స‌త్వాన్ని అంది పుచ్చుకుని వ‌చ్చిన త‌న‌యుడు న‌ట‌ర‌త్న‌కు త‌గ్గ యువ‌ర‌త్న‌గా మారాడు. తెలుగు సినిమా రంగంలో ఇప్ప‌టి త‌రంలో సాంఘీకం, పౌరాణికం ఏ పాత్ర‌లు చేయాల‌న్నా కూడా ఒక్క బాల‌కృష్ణ‌కే చెల్లింది. అయితే ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి తిరుగులేని విధంగా స‌క్సెస్ అయ్యాడు. 

 

అటు న‌ట‌నా రంగంలో గాని.. ఇటు రాజ‌కీయ రంగంలో కాని.. ఎన్టీఆర్‌ను బాల‌య్య మించ‌క‌పోయినా ఆయ‌న‌కు అస‌లు సిస‌లు వార‌సుడు అనిపించుకున్నాడు. ఇక రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన బాల‌య్య త‌న తండ్రికి ఎంతో ఇష్ట‌మైన‌, ఆయ‌న ప్రాథినిత్యం వ‌హించిన హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండుసార్లు ఘ‌న‌విజ‌యం సాధించారు. ఐదేళ్లలో అక్క‌డ కోట్లాది రూపాయ‌ల‌తో నియోజ‌క‌వ‌ర్గాన్ని బాల‌య్య అభివృద్ది చేయ‌డంతోనే ఏపీలో టీడీపీ చిత్తుగా ఓడిపోయినా బాల‌య్య భారీ మెజార్టీతో అక్క‌డ రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు.

 

తండ్రి ఎన్టీఆర్ కొండ‌వీటి సింహం లాంటి ప‌వ‌ర్ ఫుల్ సినిమా తీస్తే... అదే స్టైల్లో బాల‌య్య సింహాను చివ‌ర‌కు త‌న పేరుకు ముందు శాశ్వ‌తంగా ఉండేలా చేసుకున్నారు. సింహా సెంటిమెంట్ బాల‌య్య‌కు విప‌రీతంగా క‌లిసొచ్చింది. సింహా క‌లిసొచ్చేలా ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: