టాలెంటెడ్ ఆర్టిస్టులంటే సినిమాకు ప్లస్ అవుతుంది అంటారు. కానీ నాని.. శ్యామ్ సింగా రాయ్ కు మాత్రం ఈ టాలెంట్ ప్రాబ్లమ్ గా మారుతోంది. శ్యామ్ సింగా రాయ్ కు హీరోయిన్స్ దొరక్కుండా చేస్తోంది. హైబ్రిడ్ పిల్లని చూసి.. మిగతా హీరోయిన్లంతా నాని సినిమాకు సైన్ చేసేందుకు ఆలోచిస్తున్నారు. 

 

నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా శ్యామ్ సింగా రాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది ఈ చిత్రం. ఈ మూవీలో నాని పక్కన ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. ఇప్పటికే ఒక హీరోయిన్ గా సాయి పల్లవిని సెలక్ట్ చేశారట. 

 

శ్యామ్ సింగా రాయ్ కు మరో హీరోయిన్ గా రష్మిక మందన్నని కాంటాక్ట్ చేశారట. స్టార్ రేసులో హంగామా చేస్తోన్న రష్మిక ఇమేజ్ సినిమాకు ప్లస్ అవుతుందని దర్శక నిర్మాతలు ఈమెను సంప్రదిస్తే ఈమె మాత్రం సినిమా చేయలేనని చెప్పేసిందట. అయితే రష్మిక నో చెప్పడానికి సాయి పల్లవియే కారణమని తెలుస్తోంది. 

 

సాయి పల్లవి పెర్ఫామెన్స్ లో ది బెస్ట్ అనిపించుకుంది. ఫిదా నుంచి మొదలుపెడితే.. ప్రతీ సినిమాలో ఒక మార్క్ చూపించింది. అలాంటి సాయిపల్లవి పక్కనుంటే మమ్మల్ని డామినేట్ చేస్తుందేమో అని భయపడిందట రష్మిక. అందుకే శ్యామ్ సింగా రాయ్ కు నో చెప్పిందని తెలుస్తోంది. సో సాయి పల్లవికి పోటీ ఇచ్చేలా ఇద్దరు హీరోయిన్లని వెతకడం మేకర్స్ కు ఒక సవాల్ అనే చెప్పొచ్చు. మొత్తానికి నాని సినిమా శ్యామ్ సింగరాయ్ కు ఆదిలోనే ఇబ్బందులు తప్పడం లేదు. హీరోయిన్ల ఫ్రాబ్లమ్ ఈ సినిమాను వెంటాడుతోంది. హీరోయిన్లు ఒకరికొకరు తమకు ఇష్టమొచ్చినట్టు ఫీలవుతున్నారు. ఇది ఎప్పటికి ఓ కొలిక్కి వస్తుందో తెలియదు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: