పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఫైటర్’ మూవీని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా విడుదలచేసి బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీని చాల గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలని పూరీ జగన్నాథ్ చాల వ్యూహాలు రచించాడు. అయితే కరోనా సమస్య వల్ల ఈ మూవీ షూటింగ్ ఆగిపోవడంతో ఇప్పుడు పూరీ ఆలోచనలు మారి ఈ మూవీ కథలో కూడ అనేక మార్పులు చేస్తున్నట్లు టాక్.


ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ కోసం ఇప్పటికే ఫిక్స్ చేసిన ‘ఫైటర్’ టైటిల్ ను వరుణ్ తేజ్ కోసం వదులుకోవడానికి పూరీ విజయ్ దేవరకొండలు ఇష్టపడినట్లుగా కొన్ని వార్తలు హడావిడి చేస్తున్నాయి. వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తీయబడుతున్న సినిమాకు కిరణ్ కుమార్ కొర్రపాటి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు.


బాక్సింగ్ నేపథ్యంలో తీయబడుతున్న సినిమా కావడంతో ఈసినిమా కోసం వరుణ్ తేజ్ చాల కఠినమైన వర్కౌట్స్ చేసాడు అన్న వార్తలు కూడ వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్ లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ ను వాయిదా వేసింది.


ప్రస్తుతం ఈ మూవీకి ఒక క్యాచీ టైటిల్ పెట్టాలని ఆలోచనలు చేస్తున్న ఈమూవీ యూనిట్ కు విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ మూవీ టైటిల్ పై కన్ను పడింది. విజయ్ దేవరకొండతో పూరీ చేస్తున్న మూవీ కూడ బాక్సింగ్ నేపధ్యం కావడంతో ఈ మూవీకి ‘ఫైటర్’ అనే టైటిల్ ను ఇంచుమించు ఖరార్ చేసారు. అయితే ఇప్పుడు విజయ్ పూరీల సినిమా టైటిల్ విషయంలో మరో ఆలోచనలు వస్తున్న పరిస్థితులలో వరుణ్ తేజ్ సినిమా నిర్మాతలు ఈమధ్య పూరీని కలిసి తమకు పూరీ రిజిష్టర్ చేసుకున్న ‘ఫైటర్’ టైటిల్ ను తమకు ఇప్పించ వలసిందిగా అడగడం దానికి పూరీ జగన్నాథ్ స్పందించి ఈ ‘ఫైటర్’ టైటిల్ ను వరుణ్ తేజ్ కోసం త్యాగం చేశాడని ఇండస్ట్రీ వర్గాల టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: