తెలుగు సినిమాల్లో 1992 వ సంవత్సరం నుండి బాగా పాపులరైన మహిళా కమెడియన్ కోవై సరళ.ఈవిడ నటనతో ప్రేక్షకులను హాయిగా నవ్వుకునేలా చేస్తారు. కోవై సరళ గారు మాట వింటే చాలు నవ్వు ఆపుకోలేము. మాటకు తగ్గట్టే  ముఖములో హావభావాలు పలికించడంలో కోవై సరళకు పోటీ లేరు ఎవ్వరు.. ఈవిడ ఏది చేసిన కామెడీ ఉంటుంది. మాట్లాడిన, నవ్వినా, అల్లరి చేసిన గాని అది ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది.  ముఖ్యంగా బ్రహ్మానందంతో కోవై సరళ కాంబినేషన్  సూపర్ డూపర్ హిట్.ముఖ్యంగా కోవై సరళ నటించిన  "క్షేమంగా వెళ్లి లాభంగా రండి" చిత్రం ఈమెకు  మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమాలో బ్రహ్మానందం, కోవై సరళ  మధ్య కొన్ని సీన్లు చూస్తే కుర్చీలో కుర్చీని సినిమా చూసే వాళ్ళు లేచి మరి కడుపుబ్బా నవ్వుకుంటారు.

 

 

 

అలాగే "తిరుమల తిరుపతి వేంకటేశ "సినిమాలో కూడా కోవై సరళ నటన అమోఘం. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా పాపులర్ కమెడియన్‌గా కోవై సరళ బాగా పరిచయం. దాదాపు 750 సినిమాల్లో నటించింది. తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ప్రకటించే ఉత్తమ హాస్యనటి పురస్కారాలను మూడు సార్లు అందుకున్నది.అలాగే మన  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఓరి నీప్రేమ బంగారం కానూ (2003) అనే సినిమాకు నంది ఉత్తమ హాస్యనటి పురస్కారం అందుకున్నది.పెళ్ళాం చెప్తే వినాలి, పెళ్ళి, సింహరాశి, నువ్వే కావాలి , మృగరాజు, మళ్ళీ మళ్ళీ చూడాలి, హనుమాన్ జంక్షన్, సందడే సందడి,దేశముదురు,కాంచన సినిమాల్లో కామెడీ పాత్ర చేసి మంచి మార్కులు కొట్టేసింది.  

 

 

అనేక సినిమాలలో నటించి చక్కటి హాస్యాన్ని పండించింది కోవై సరళ.లారెన్స్ నటించిన కాంచన సినిమాలో కోవై సరళ చేసిన కామెడీ అంత ఇంతా కాదు.దెయ్యం వచ్చే సమయంలో గాని, లారెన్స్ కి అమ్మ గా చేసిన సీన్లు గాని  తలుచుకుంటే ఇప్పటికి నవ్వు ఆగదు.. మన తెలుగు ఇండస్ట్రీలో హాస్యాన్ని పండించే  నటి మణుల్లో చేప్పుకోతగ్గ నటి కోవై సరళ.

మరింత సమాచారం తెలుసుకోండి: