ఆ తరువాత కియారా అద్వానీ అన్నారు. వీళ్ళెవ్వరూ కాదు.. ఊర్వశి రౌటెలా వంటి బోల్డ్ బ్యూటీ సీతగా కనిపించబోతుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి.అలాగే ప్రభాస్ స్నేహితురాలు అనుష్క శెట్టి అని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్. 2021 జనవరిలో డెలివరీ అవుతుంది అని కోహ్లీ ఇటీవల ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చాడు. అందుకే ఇటీవల ‘ఆది పురుష్’ దర్శకుడు ఓం రౌత్ కూడా అనుష్క శర్మను కలిసి ఆమె పాత్ర గురించి చెప్పగానే సానుకూలంగా స్పందించిందట.
ఆమె కనుక ఈ పాత్ర చెయ్యడానికి ఒప్పుకుంటే అందరూ హ్యాపీనే..! నటన పరంగా కూడా అనుష్క శర్మ మెప్పిస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. అయితే అనుష్క శర్మ.. సీత పాత్రలో కనిపిస్తుందా లేదా..? ఒకవేళ ఆమె ఈ పాత్రలో నటించకపోతే.. సీత పాత్రలో ఎవరు నటిస్తారు? అనే కన్ఫ్యూజన్ కు.. ‘ఆది పురుష్’ దర్శకనిర్మాతలు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో మరి..!
ఇక ప్రభాస్ ప్రస్తుతం "రాధే శ్యామ్" సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత "మహానటి" ఫేమ్ నాగ్ అశ్విన్ తో కూడా ఒక పాన్ ఇండియా మూవీ చెయ్యబోతున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి