నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా డిజాస్టర్ తో కళ్ళు తెరిచిన అల్లు అర్జున్ దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకోని అల వైకుంఠపురంలో సినిమా చేశాడు. ఈ సినిమా కి హైప్ కి తగ్గ హిట్ లభించింది. అల్లు అర్జున్ కి ఎన్ని హిట్లు వున్న రికార్డులు లేవు. కాని త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బన్నీ కి మంచి హిట్ తో పాటు అనేక రికార్డులు కూడా ఇచ్చింది. ఇక ఈ సినిమా హిట్ తో బన్నీ తరువాత సుకుమార్ తో చెయ్యబోయే పుష్ప సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. ఇక అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ సెట్స్ లో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. గత ఐదు నెలలుగా బన్నీ లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్నారు. దర్శకుడు సుకుమార్ పుష్ప షూటింగ్ కోసం లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నారు. కేరళలో ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు సుకుమార్. కరోనా రాకతో ఆ ప్లాన్ చెడిపోయింది. దీనితో తెలుగు రాష్ట్రాలలో ఉన్న అడవులలోనే పుష్ప షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

కాగా ఈ మూవీలో బన్నీ కోసం అదిరిపోయే ఓ యాక్షన్ సీక్వెన్స్ రాశారట సుకుమార్. ఓ సన్నివేశంలో బన్నీ ఏకంగా పులితో తలపడతాడట. సాహసోపేతమైన పులి ఫైట్ ని సుకుమార్ విజువల్ ట్రీట్ గా తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ మూవీలో బన్నీ లారి డ్రైవర్ గా కనిపించనున్నారు. దీనితో మూవీ ప్రధాన భాగం దట్టమైన అడవులోనే సాగుతుందట. ఎన్నో ఆసక్తికర అంశాలతో సుకుమార్ మూవీని సిద్ధం చేయనున్నారు.

ఇక ఈ మూవీతో బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం మరో విశేషం. హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో పుష్ప గ్రాండ్ గా విడుదల కానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే 50శాతం షూటింగ్ పూర్తి అయ్యేది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: