మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లుగా రాణించిన సీనియర్ హీరోయిన్లు ప్రస్తుతం మళ్లీ చక్రం తిప్పుతున్నారు. అయితే అది హీరోయిన్ గా కాదులెండి.. అమ్మ, అత్త, అక్క, వదిన.. వంటి పాత్రలో. అయితే వారి పారితోషికాలు మాత్రం హీరోయిన్ల రేంజ్ లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఏ ఏ సీనియర్ ఎంతెంత పారితోషికం తీసుకుంటుందో మన సమీక్షలో తెలుసుకుందాం రండి..

ఇక అసలు వివరాల్లోకి వెళితే.. 
1. రమ్యకృష్ణ : మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జునల పక్కన హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రమ్యకృష్ణ. ఇప్పుడు కుర్ర హీరోలకు అమ్మ గా అత్తగా నటిస్తోంది. ఈమె రోజుకు రూ.2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ పొజిషన్లో ఉన్నారు.
2. నదియా : పాతికేళ్ల క్రితం హీరోయిన్ గా చేసింది నదియా.   "మిర్చి" సినిమాలో ప్రభాస్ తల్లిగా ఆకట్టుకున్నారు. "అత్తారింటికి దారేది"లో టైటిల్ రోల్ పోషించారు. ఈమె రోజుకు రూ. 2 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
3. జయసుధ : సహజ నటిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది జయసుధ. "అమ్మ నాన్నతమిళ అమ్మాయి", "బొమ్మరిల్లు" సినిమాల్లో హీరో తల్లిగా అద్భుత నటనను ప్రదర్శించారు. ఈమె సినిమాకు రూ.20 లక్షలు, లేదా రోజుకు రూ. లక్ష రూపాయల వరకు తీసుకుంటుంది.
4. పవిత్ర లోకేష్ : "సన్నాఫ్ సత్యమూర్తి", "రేసు గుర్రం" సినిమాల్లో తల్లిగా నటించిన పవిత్ర లోకేష్ రోజుకు రూ.50-60 వేలు తీసుకుంటున్నారు.
5. ప్రగతి : గంగోత్రి సినిమా నుండి ప్రగతి తల్లి పాత్రలు చేస్తోంది. ఈమె రోజుకు రూ.40 వేలు అందుకుంటున్నారు. గతంలో ఈమె ఆరు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లుగా రాణించిన సీనియర్ హీరోయిన్లు ప్రస్తుతం మళ్లీ చక్రం తిప్పుతున్నారు. అయితే అది హీరోయిన్ గా కాదులెండి.. అమ్మ, అత్త, అక్క, వదిన.. వంటి పాత్రలో. అయితే వారి పారితోషికాలు మాత్రం హీరోయిన్ల రేంజ్ లో ఉన్నాయి. అయితే ఒక రోజుకు రమ్యకృష్ణ రూ.2 లక్షలు, నదియా రూ. 2 లక్షలు, జయసుధ రూ. 1 లక్ష, పవిత్ర లోకేష్ రూ. 50 వేలు, ప్రగతి రూ. 40 వేల చొప్పున పారితోషికం అందుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: