ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాకు టైటిల్ గా రిపబ్లిక్ అని పెట్టబోతున్నారట. ఆల్రెడీ టైటిల్ ఫిక్స్ చేశారట త్వరలోనే దీనికి సంబందించిన అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా టైటి ప్రకటిస్తారని అంటున్నారు. సాయి ధరం తేజ్ తో దేవా కట్టా తప్పకుండా ఈ సినిమా అటు మెగా హీరోకి.. ఇటు దేవా కట్టాకి సూపర్ క్రేజ్ తెచ్చే సినిమా అవుతుందని అంటున్నారు.
ఈ సినిమాకు టైటిల్ గా ఉన్న రిపబ్లిక్ కూడా అంచనాలు పెంచుతుందని చెప్పొచ్చు. మరి సాయి ధరం తేజ్ సినిమాకు రిపబ్లిక్ టైటిలే ఫిక్స్ చేస్తారా లేక మరో టైటిల్ పెడతారా అన్నది చూడాలి. సినిమాలో సాయి ధరం తేజ్ ఐఏఎస్ అఫీసర్ గా కనిపిస్తాడని అంటున్నారు. చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాలతో సత్తా చాటిన సాయి తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.