ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్4 అంతకంతకు మరింతగా ప్రేక్షకాదరణతో పాటు భారీ స్థాయిలో టిఆర్పి రేటింగ్స్ ను దక్కించుకొని ముందు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడిచిన మూడు సీజన్స్ కంటే కూడా ఈ సీజన్ మరింత క్రేజ్ దక్కించుకుంటూ ఏకంగా స్టార్ మా ఛానల్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకు వెళ్ళింది అని ఇటీవల నాగార్జున ఒక సందర్భంలో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే ఏడు వారాలకు పైగా సాగిన ఈ తాజా సీజన్ లో ఇటీవల దసరా పండుగ సందర్భంగా జరిగిన ప్రత్యేక ఎపిసోడ్లో నాగార్జున కోడలు అక్కినేని సమంత సందడి చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ ఎపిసోడ్ లో భాగంగా దివి హౌస్ నుండి ఎలిమినేట్ కాబడింది. ఇక ఆ ఎపిసోడ్ లో సమంతతో పాటు హైపర్ ఆది, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, కార్తికేయ తదితరులు సందడి చేసి షో లో మరింతగా జోష్ నింపారు. ఇకపోతే ఈ షోలో సమంత కట్టిన చీరకు సంబంధించి ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా కొంత చర్చ జరుగుతోంది.

సమంతా కట్టిన ఆ ఎరుపు రంగు చీర ధర దాదాపుగా ఐదు లక్షలకు పైగానే ఉంటుందని, భారత దేశంలోని ప్రఖ్యాత డిజైనర్లు కొందరు ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేసిన ఆ చీరని సమంత కట్టుకొని దానికి మరింత వన్నె తెచ్చారని, అలానే ఆ చీర తోపాటు దానికి మ్యాచింగ్ గా ఆమె ధరించిన ఆభరణాలు కూడా భారీ ధర కలిగినవే అని అంటున్నారు. ఇక వీటితో పాటు ఆ ప్రత్యేక ఎపిసోడ్ కి గాను ఆమెకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా ముట్టిందని కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూసుకుంటే మొన్నటి దసరా సందర్భంగా ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 ఎపిసోడ్ బాగా కాస్ట్లీ గానే సాగిందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: