అప్పట్లో కాస్టింగ్ కౌచ్ అంటూ న్యూస్ ఛానల్స్ లో తెగ హల్ చల్ చేసిన నటి శ్రీ రెడ్డి .ఇప్పుడు మరో సారి ప్రముఖ హీరోయిన్ పై నోరు పారేసుకుంది .. అసలే సినిమాలు రాక ఏమి చేయలేక మన రాష్ట్రాన్ని వదిలి చెన్నై కి చెక్కేసిన ఈ పాప కుదురుగా ఉండే రకం లాగా కనిపించడం లేదు .. ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతుంది ..

తను అంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించిన  అవి పెద్దగా పేరు సంపాదించలేదు.. ఆ తర్వాత కోలీవుడ్ కు వెళ్లిన శ్రీ రెడ్డి  అక్కడి  నిర్మాతలు మరియు నటుల ప్రవర్తనపై పలు  కామెంట్స్ చేస్తున్న సంగతి  తెలిసిందే..  తన సంచలన కామెంట్లతో నటీనటులకు మరియు దర్శక నిర్మాతలకు కంటి మీద  కునుకు లేకుండా చేస్తుంది..  ఏ  డ్రెస్ వేసుకుంటే దాని పై కామెంట్స్ చేస్తుందో అని హీరోయిన్స్ అందరు పైకి చెప్పకుండా  లోలోపల శ్రీరెడ్డి పై తిట్టుకుంటున్నారు ..

తాజాగా శ్రీ రెడ్డి టాలీవుడ్  హీరోయిన్ సమంత వేసుకున్న బికినీ పై సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లోకి కెక్కింది..
శ్రీ రెడ్డి  సోషల్ మీడియాలో  కామెంట్ చేయడం కొత్త విషయమేమీ కాదు..  తాజాగా సమంత ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది ..

సమంత ప్రస్తుతం మాల్దీవ్స్ లో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే సమంత ఇటీవల ఒక బాత్ టబ్ లో కూర్చొని పోజిస్తున్న ఒక ఫోటో ని షేర్ చేసింది..అయితే  దీనిపై ఈ ఫోటోపై  శ్రీ రెడ్డి  వ్యాఖ్యల చేస్తూ రెచ్చిపోయింది.. పెళ్లి అయిన సమంత తన వద్ద చాలా ఆస్తి ఉందని, అయినా కూడా తను ఇలా అందాలను ఆరబోస్తూ ఎందుకు వ్యాపారం చేస్తోందంటూ సమంతా పై సంచలన కామెంట్స్ చేసింది..దీంతో  శ్రీరెడ్డి వ్యవహారంపై  టాలీవుడ్ వర్గాలు బాగా కోప్పడుతున్నాయి .. సమంత పై ఆలా కామెంట్స్ చేయడం చాలా తప్పు అని శ్రీరెడ్డి ని టాలీవుడ్  హెచ్చరిస్తున్నాయి ..

శ్రీ రెడ్డి పోయి పోయి  సమంతాపై అలా కామెంట్ చేయడం తో టాలీవుడ్ లో  పెద్ద దుమారమే రేపింది..అయితే శ్రీరెడ్డి సమంత  పై కామెంట్స్ చేయడం చూసి సమంత   అభిమానులు శ్రీరెడ్డి పై  తిట్ల బాణాలని  కురిపిస్తున్నారు ..   అభిమానుల నుంచి శ్రీ రెడ్డి పై తీవ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: