తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యి చాలా రోజులే అయిపొయింది.. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇప్పటివరకు సినిమా థియేటర్లను ఓపెన్ చేయలేదు. నిర్మాతలు కూడా ఈ టైం లో సినిమా లు రిలీజ్ చేతులు కాల్చుకోవడం ఇష్టం లేక ఊరుకున్నారు.. దీంతో సంక్రాంతికే సినిమాలు వస్తాయని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో మాత్రం సినిమా లు రిలీజ్ చేస్తున్నారు. తమిళనాడులో దీపావళి పండగ సందర్భంగా సగం కెపాసిటీతోనే బిస్కోత్ లాంటి కొత్త మూవీస్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులను రప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ ధైర్యం ఎవరు చెయ్యట్లేదు..

తాజాగా టాలీవుడ్ భవిష్యత్ కి మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ ఆశాదీపం అయ్యాడు.. తన సినిమా ను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్సినిమా కి సంగీతం అందిస్తుండగా ఈ సినిమా నుంచి వచ్చిన మూడు పాటలకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది.

ప్రతి రోజు పండగే లాంటి హిట్ మూవీ తర్వాత చేసిన సినిమా కావడంతో సుప్రీమ్ హీరో సాయి తేజ్ కి దీని మీద చాలా నమ్మకం ఉంది. అందుకే ఈ సినిమా ను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు..సోలో బ్రతుకే సో బెటారూ సర్వ హక్కులను సొంతం చేసుకున్న జీ సంస్థ మొదటిసారి పంపిణి రంగంలోకి దిగబోతోంది. బిజినెస్ ఎంతకు జరుగుతోందో బయటికి తెలియనివ్వడం లేదు. ఇంకా 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన ఈ నెలంతా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సగం కెపాసిటీతో కలెక్షన్లు ఎంత మాత్రం వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఏదైనా తేడా జరిగితే చాలా తక్కువ గ్యాప్ తో ఓటిటిలో స్ట్రీమ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: