టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకులలో సుకుమార్ ఒకడు. తీసింది తక్కువ సినిమాలే అయిన.. తన స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వ ప్రతిభతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో ప్లేస్ దక్కించుకున్నాడు. సుక్కు మేకింగ్ తో పాటు.. అతడి సినిమాల్లో లాజిక్స్ కూడా ప్రేక్షకులను ఎంతో ఆశ్చర్య పరుస్తూ.. ఆకట్టుకుంటాయి. అందుకే  ఇండ్రస్టీ లో ఎంత మంది డైరెక్టర్స్ ఉన్నా.. మన సుక్కు స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. అంతేకాకుండా ఇప్పటివరకు సుక్కు..ఎక్కువ సినిమాలు అగ్ర హీరోల తోనే తీయడం విశేషం అనే చెప్పాలి. ఇదిలా ఉంటె అతి తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన సుకుమార్.. తన సినిమాలకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు తాజాగా సుకుమార్ గురించి ఓ క్రేజీ వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
 
సుకుమార్ తాజాగా ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడట. కొండాపూర్ ప్రాంతంలో అన్ని సౌకర్యాలతోనూ ఎంతో అందంగా సుకుమార్ కొత్త ఇల్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఇంటి ఖరీదు రూ. 12 కోట్లు అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరో విషయం ఏంటంటే.. సుకుమార్‌ కొత్త ఇంటి గృహప్రవేశం కార్యక్రమం కూడా ఇటీవలే పూర్తి చేశాడట. అయితే కరోనా కారణంగా ఈ కార్యక్రమానికి ఎవరినీ ఆహ్వానించలేదని అంటున్నారు.రంగస్థలం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మన సుకుమార్ కి ఆ సినిమా భారీగానే లాభాలు తెచ్చిపెట్టినట్లుంది.. అందుకేనేమో ఏకంగా 12కోట్లు పెట్టి కొత్త ఇల్లును కొన్నాడు. ఒక ప్రస్తుతం సుకుమార్.. అల్లు అర్జున్ తో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు.

పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ, తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. గంధపు చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో బన్నీ కి విలన్స్ గా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మంది విలన్స్ ని సెట్ చేస్తున్నాడట సుకుమార్.ఇక లాక్ డౌన్ తర్వాత ఈ మధ్యే మొదలైన ఈ సినిమా ప్రస్తుతం గోదావరి జిల్లాలోని మారేడుపల్లి అడవుల్లో షూటింగ్ ని జరుపుకుంటుంది..వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: