ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...దేశంలో రోజు రోజుకు మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇంటి నుంచి చదువుకోడానికి చాలా దూరం వచ్చి హాస్టళ్లల్లో వుండే  అమ్మాయిలపై వార్డెన్లు పాల్పడే అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ఇటీవల గుజరాత్‌లోని ఓ హాస్టల్ వార్డెన్ అమ్మాయిల పట్ల పైశాచిక లైంగిక  చర్యలకు పాల్పడిన ఘటన మరువక ముందే హైదరాబాద్‌లోనూ అలాంటి ఘటనే జరిగిందంటూ ప్రముఖ సింగర్ హీరో రాహుల్ రవీంద్రన్ భార్య అయినా చిన్మయ్ బయటపెట్టింది. మీటూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న చిన్మయి వివిధ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ఆమె సోషల్‌మీడియా ద్వారా వాటి గురించి స్పందిస్తూ బయట పెడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ వార్డెన్ పైశాచికత్వంపై బాధితురాలి స్పందనను చిన్మయి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ వెల్లడించింది...


ఇక ఆ విద్యార్థిని బాధితురాలి కథనం ప్రకారం ‘నేను 2015లో పదో తరగతి చదివేదాన్ని. హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌లో చదువుకుంటూ అక్కడే హాస్టల్‌లో ఉండేదాన్ని. అక్కడ వార్డెన్ అమ్మాయిలను చాలా ఇబ్బందులు పెట్టేది. పీరియడ్స్ వచ్చాయని చెబితే వెంటనే నమ్మేది కాదు. బట్టలు విప్పి చూపించమనేది. అలాంటి పరిస్థితి నాకూ ఓ రోజు వచ్చింది. క్లాసులో ఉండగా నాకు పీరియడ్స్ వచ్చాయి. దీంతో టీచర్ పర్మిషన్ తీసుకుని హాస్టల్‌కి వెళ్లగా వార్డెన్ లోనికి అనుమతించలేదు. స్కూల్ టైమ్‌లో ఇక్కడికెందుకు వచ్చావంటూ తిట్టింది.


పీరియడ్స్ వచ్చాయని చెప్పగా నమ్మలేదు. బట్టలు విప్పి చూపించమనడంతో అలాగే చేశాను. ఆ తర్వాతే నన్ను హాస్టల్‌లోకి అనుమతించింది. ఆనాటి ఘటన తలుచుకుంటే ఇప్పటికీ నాకు బాధేస్తుంటుంది’ అని ఆ విద్యార్థిని చెప్పుకొచ్చింది.ఎన్ని చట్టాలు వచ్చిన కాని ఆడవారి మీద ఇలాంటి అరాచకాలు ఆగట్లేదు.ఇలాంటి మరెన్నో విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: