ఇకపోతే రేపటినుంచి ఈ సీజన్ 14 వారంలోకి అడుగుపెట్టబోతోంది. కాగా కొన్ని అనధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి రేపటి వారం ఎలిమినేషన్ లో ఉండబోయే కంటెస్టెంట్ లు సోహైల్, అరియానా, అభిజిత్, మోనాల్ మరియు హారిక అని సమాచారం. అవినాష్ హౌస్ నుంచి నిష్క్రమించడంతో హౌస్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా వారిలో గ్రాండ్ ఫినాలే కి చేరిన అఖిల్ మినహాయిస్తే మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లో ఉన్నట్లు సమాచారం. అలానే రాబోయే వారం ఇప్పటి వరకు కొనసాగిన మిగతా వారాలతో పోల్చుకుంటే మరింత టఫ్ గా సాగనుందని అలానే బిగ్ బాస్ కూడా హౌస్ మేట్స్ కు మరింత కష్టతరమైన టాస్క్ లు ఇవ్వనున్నారని అంటున్నారు.
ఇప్పటికే మరొక రెండు వారాల్లో ఫినాలే షో ఉండడంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో జరగబోయే ఈ షో యొక్క గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ స్టార్ హీరో ఒకరు ప్రత్యేక అతిథిగా రానున్నట్లు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రాబోయే వారాలు బిగ్ బాస్ సీజన్ 4 షో మరింత ఆసక్తికరంగా సాగనున్నట్లు తెలుస్తోంది.....!!