‘కెజిఎఫ్ చాప్టర్ 1` సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. అలాగే ఈ చిత్రంలో హీరోగా నటించిన యష్ కూడా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సినిమాకు సీక్వెల్ అంటే హైప్ మామూలుగా ఉంటుందా? అందుకే ఇప్పుడు ఈ హీరో - డైరెక్టర్ కాంబోలో వస్తున్న‘కెజిఎఫ్ చాప్టర్ 2’ కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర బృందం. ఈ సినిమా షూటింగ్ లో చివరి షెడ్యూట్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైంది. ఇక్కడ క్లైమాక్స్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో హీరో యష్ తో పాటు అధీరా పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ కూడా పాల్గొంటున్నారు.

ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయిందట. ఈ లేటెస్ట్ షెడ్యూల్ గనుక పూర్తయితే సినిమా మొత్తం పూర్తయినట్లే. ఈ నేపథ్యంలోనే చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఫైట్ మాస్టర్స్ అన్బుమణి .. అరివు మణి తో కలిసి సెట్ లో వున్న ఫొటోలను ప్రశాంత్ నీల్ షేర్ చేశారు. ఈ ఫొటోలు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అలాగే క్లైమాక్స్ కు సంబంధించిన ఓ కీలక ఘట్టాలకు సంబంధించి కూడా ఇక్కడే షూటింగ్ మొదలుపెట్టారు. ఇందులో యష్, సంజయ్ దత్ పాల్గొంటున్నారు. వీళ్లతో పాటు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లు, ఫైటర్ లు కూడా పాలు పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా బయటికి వచ్చిన యష్ ఫొటో ఫ్యాన్స్‌‌‌ను విపరీతంగా అలరిస్తోంది.

`కీలక ఘట్టాలన్నీ పూర్తయ్యాయి. ఇది ‘కెజిఎఫ్ చాప్టర్ 2’ చివరి షెడ్యూల్. కానీ ఈ మూవీకి సంబంధించిన విలన్ ఎప్పటికీ అలాగే వుంటాడు` అని ట్వీట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇందు కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారట. ఈ మూవీ టీజర్ ని జనవరి 8న హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: