
1. సుహాసిని - చారుహాసన్ :
మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో అడుగుపెట్టిన ఏకైక నటి సుహాసిని.చారుహాసన్ కూతురు. చారుహాసన్ తమిళ్ లో గొప్పనటులు.అంతేకాకుండా కమల్ హాసన్ కు స్వయానా అన్న. రీసెంట్ గా డియర్ కామ్రేడ్ సినిమాలో హీరో తాత పాత్ర వహించాడు.
2. శృతిహాసన్, అక్షరహాసన్ -కమల్ హాసన్:
విశ్వనటుడు కమల్ హాసన్ గారి కూతుళ్లు శృతిహాసన్, అక్షర హాసన్.శృతిహాసన్ హిందీ, తమిళ్,తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ గొప్ప పేరు తెచ్చుకుంది. ఇక అక్షరహాసన్ కూడా హిందీ లో రెండు సినిమాల్లో నటించింది.అంతేకాకుండా తమిళ్ లో అజిత్ నటించిన వివేకం సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర లో నటించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది.తర్వాత తన తండ్రి నిర్మించిన కదరం కొండాన్ లో హీరోయిన్ గా నటించింది.
3.కరీష్మా కపూర్,కరీనా కపూర్ -రణధీర్ కపూర్ :
బాలీవుడ్ లో రణబీర్ కపూర్ గొప్ప నటుడు. మొదటగా కరిష్మా సినిమాల్లోకి వచ్చింది ఆ తర్వాత కరీనా కపూర్ కూడా బాలీవుడ్ లోకి ప్రవేశం చేసి ఇప్పుడు ఎవరూ ఊహించనంత పెద్ద స్టార్ అయింది.
4. పంకజ్ కపూర్ -సనా కపూర్:
బాలీవుడ్ లో పంకజ్ కుమార్ గొప్ప నటన కలిగిన వ్యక్తి. అలాగే ఆయన కూతురు సనా కపూర్ కూడా షాన్దార్ సినిమాలో నటించింది. ఇందులో పంకజ్ కి కూతురు గా నటించడం విశేషం.
5. రాజేష్ కన్నా- ట్వింకిల్ ఖన్నా:
రాజేష్ ఖన్నా బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు. అలాగే ఆయన కూతురు ట్వింకిల్ ఖన్నా కూడా బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి, అందరినీ మెప్పించింది. ఇక టాలీవుడ్ లో శ్రీను సినిమాలో వెంకటేష్ కి జోడీగా నటించి తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకుంది.
6.చంకీ పాండే -అనన్య పాండే:
ఈమె కూడా బాలీవుడ్ లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమా లో ఎంట్రీ ఇచ్చి తర్వాత పతి పత్ని ఔర్ వహ్ సినిమాలో నటించింది. ఇప్పుడు పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది.
7. శత్రుఘ్న సిన్హా- సోనాక్షి సిన్హా:
సోనాక్షి సిన్హా దబాంగ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఎన్నో హిందీ సినిమాల్లో నటించింది. కోలీవుడ్ లో రజనీకాంత్ తో జతకట్టి లింగా సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం హిందీ సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది.
8.గోవింద - టీనా ఆహుజా:
టీనా ఆహుజా అసలు పేరు నర్మద. టీనా గా పేరు మార్చుకొని 2015 లో సెకండ్ హ్యాండ్ హస్బెండ్ అనే మూవీ లో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. టీనా ఈ ఒక్క చిత్రంలో మాత్రమే నటించింది.
9.సైఫ్ అలీ ఖాన్- సారా అలీ ఖాన్:
సారా కేదార్నాథ్,సింబా, లవ్ ఆజ్ కల్ 2 సినిమాలు చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం కూలి నెంబర్ వన్ సీక్వెల్ అంతరంగిణి చిత్రాల్లో నటిస్తోంది.
10.సునీల్ శెట్టి - అతియా సల్మాన్:
ఖాన్ నిర్మించిన హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది తన నటనతో అందరినీ మెప్పించింది.
11. అనిల్ కపూర్- సోనం కపూర్:
సావరియా మూవీ ద్వారా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి సినిమా సినిమాకు సంబంధం లేకుండా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. తరువాత ముబారకాన్,మోతీచూర్, చక్కచూర్ లాంటి సినిమాల్లో నటించింది.
12. సుమిత్ సైగల్- సాయేషా:
సాయేషా తెలుగులో అఖిల్ సినిమాలో చేసింది. ఈమె తండ్రి హిందీలో ప్రముఖ నటుడు.అంతేకాదు గొప్ప నటుడు అయిన దిలీప్ కుమార్ సాయేషా కు తాత అవుతారు. సాయేషా తమిళ్, కన్నడ సినిమాలో నటిస్తోంది.
13. శక్తి కపూర్- శ్రద్ధా కపూర్:
శక్తి కపూర్ బాలీవుడ్ లో విలన్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నాడు ఆయన అలాగని ఆయన కూతురు శ్రద్ధా కపూర్ తీన్ పత్తి ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆశిక్ 2 మూవీ లో స్టార్ డం తెచ్చుకుంది తరువాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించి సాహో సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం హిందీ సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది.