ఇంటర్నెట్ డెస్క్: కొత్త సంవత్సరం సినీ అభిమానులకు ఊపిరాడడం లేదు. ఒక్కో హీరో ఒక్కో ట్రీట్ ఇస్తూ తమ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ నుంచి ఓ కొత్త లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. దీని గురించి ముందుగానే చెప్పింది. అయితే మరో వైపు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ నుంచి కూడా ఓ సర్‌ప్రైజ్ పోస్టర్ రిలీజ్ చేసింది యూవీ క్రియేషన్స్. ఇది ప్రభాస్ అభిమానులకు తెగ సంతోషం కలిగించింది. ఇక ఈ రోజు(శుక్రవారం) ఉదయం మాస్ మహారాజ రవితేజ ఈ రోజు ఉదయం ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా ఇచ్చాడు. క్రాక్ ట్రైలర్ విడుదల చేయడమేకాకుండా, ఆ తరువాత డ్యూయెల్ రోల్‌లో నటిస్తున్న ‘ఖిలాడీ’ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు.

ఇక ఇప్పుడు కీర్తి సురేశ్, నితిన్ జంటగా నటిస్తున్న రంగ్‌ దే నుంచి కూడా ఇప్పుడు ఒక అఫీషియల్ న్యూస్ వచ్చింది. సంక్రాంతి బరిలో సినిమా ఉండబోతోందంటూ వినిపిస్తున్న వార్తలపై రంగ్‌దే టీం క్లారిటీ ఇచ్చింది. సినిమాను మార్చి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నితిన్, కీర్తి సురేష్ తొలి కాంబినేషన్‌లో సూర్యదేవర నాగవంశీ ఆధ్వర్యంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. 'ప్రేమ'తో కూడిన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పీసీ .శ్రీరామ్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం హైలెట్‌గా నిలవనుంది. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేశ్ చాలా అందంగా కనిపిస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. కీర్తి అందాన్ని చూసేందుకే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నామంటూ కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: