బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా రాబోతున్న సినిమా అల్లుడు అదుర్స్. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేయగా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సంతోష్ శ్రీనివాస్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ తో పాటుగా బెల్లంకొండ శ్రీనివాస్ ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ సీన్స్ ను ఈ సినిమాలో ఉంచారని తెలుస్తుంది. ఇక ట్రైలర్ ఇలా రిలీజైందో లేదో అలా ట్రెండింగ్ లో ఉండూ వచ్చింది. ట్రైలర్ రిలీజైన కొద్ది గంటల్లోనే 20 లక్షల వ్యూస్ దాకా రాబట్టిందని తెలుస్తుంది. అన్ని డిజిటల్ వ్యూస్ కలిసి అల్లుడు అదుర్స్ ట్రైలర్ 2 మిలియన్ క్రాస్ అయినట్టు ప్రకటించారు చిత్రయూనిట్. అంతేకాదు 1 లక్ష దాకా లైక్స్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది.

అల్లుడు శీను సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలైతే భారీ బడ్జెట్ తో చేస్తున్నా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవడంలో ఫెయిల్ అవుతున్నాడు. రాక్షసుడు సినిమా హిట్ అవగా అల్లుడు అదుర్స్ మీద ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. సినిమాలో హీరోయిన్ గా నటించిన ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ కానుందని అంటున్నారు. అందం, అభినయం రెండిటిలో అమ్మడు అదరగొడుతుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: