ఇకపోతే దాని తర్వాత విజయ్ దేవరకొండ సరసన పరుశురాం తెరకెక్కించిన గీతా గోవిందం సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన రష్మిక ఆ మూవీతో ఏకంగా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని కెరీర్లో అతి పెద్ద బ్రేక్ ని సంపాదించింది. ఇక అక్కడి నుంచి ఆమెకు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఇక ఆపై ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు అలాగే ఇటీవల యువ నటుడు నితిన్ సరసన నటించిన భీష్మ సినిమాలు రెండూ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకని రష్మిక కెరీర్కి మరింత బలమైన బాటలు వేశాయి. ఇక ప్రస్తుతం రష్మిక తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన పుష్ప సినిమాతో పాటు యువనటుడు శర్వానంద్ సరసన ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా కూడా చేస్తోంది.
ఇకపోతే రష్మిక విషయమైన లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటికే పలువురు దర్శకులు నిర్మాతలు తమ సినిమాల్లో హీరోయిన్ గా దాదాపుగా మొదటి ఛాయిస్ గా రష్మిక నే అనుకుంటున్నారని ఇటీవల పలువురు దర్శక నిర్మాతలు ఆమె ఇంటికి వెళ్లి కథలు వినిపించడంతో అవి నచ్చిన వెంటనే ఆమె వాటికి డేట్లు కేటాయిస్తున్నారని ఆ విధంగా ప్రస్తుతం ఎంతో బిజీగా కొనసాగుతున్న రష్మిక ఈ సినిమా లతో మంచి సక్సెస్ అందుకుంటే రాబోయే రోజుల్లో ఆమె కెరీర్ మరింత అత్యద్భుతంగా కొనసాగడం ఖాయం అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మొత్తంగా టాలీవుడ్ లో రష్మిక నక్కతోక తొక్కిందని ఇక రాబోయే రోజుల్లో ఆమెకు లభించేది అంతా బంగారు భవిష్యత్తు అనేది ప్రేక్షకులు, ఆమె అభిమానులు చెబుతున్న మాట. ఆమె తదుపరి సినిమాలతో ఎంత వరకు సక్సెస్ అందుకుని ముందుకు సాగుతారో తెలియాలంటే మరి కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయక తప్పదు.......!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి