పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో నో అందరికీ తెలిసిందే.. కానీ ఆయన నిజ జీవితంలో మాత్రం ఒక సామాన్యుడు లాగే ఉంటారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఉండటం పవన్ నైజం. ఆయన లోని ఈ స్వభావానికి మెచ్చి చాలా మంది ఆయనకు ఫ్యాన్స్ అవుతున్నారు. పండగొచ్చినా.. పబ్బమొచ్చినా పవన్ మాత్రం అలాగే ఉంటాడు. ఎవరితోనూ పెద్దగా కలవడు. కుటుంబంతో కూడా కలవడం కష్టమే. ఎప్పుడో ఓసారి ఆయన కుటుంబంతో పాటు పండగలు సెలబ్రేట్ చేసుకుంటాడు.



ఇప్పుడు కూడా మెగా కుటుంబం అక్కినేని వాళ్లతో కలిసి సంక్రాంతి పండగను జరుపుకున్నారు. అయితే బాబాయి తో కాసేపు గడపాలని అనుకున్న చెర్రీ పవన్ ఇంటికి వచ్చాడు. నాయక్ సమయంలో మీడియా తమ గురించి ఏం రాసినా కూడా వెంట్రుకతో సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు చరణ్. ఆ తర్వాత బాబాయిని చూసి చాలా నేర్చుకున్నా అని చాలా సందర్భాల్లో చెప్పాడు. అందుకే చెర్రీ అంటే పవన్ కు కూడా చాలా ఇష్టమని తెలుస్తుంది. అబ్బాయి ఎందుకు పిలిచిన బాబాయి కాదనకుండా వస్తాడు.



పవన్ తో తనకున్న అనుబంధం గురించి కూడా ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంటాడు చరణ్.మెగా ఫ్యామిలీ వీరిద్దరూ బాబాయి అబ్బాయి కన్నా కూడా అన్నా , తమ్ముళ్లు లాగా ఉంటారు. కుటుంబంతో పాటు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్న తర్వాత సమయం తీసుకుని మరీ బాబాయ్ ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ పవన్‌ను కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. పవన్, రామ్ చరణ్ కలిసున్న ఫోటోలు చూసి మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.. వీరిద్దరూ ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఇటీవలే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా టీజర్ విడుదల అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: