కోలీవుడ్ క్రేజీ హీరో ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమా వ‌స్తుందంటే ద‌క్షిణ భార‌త దేశంలోని అన్ని భాషల్లో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. విజ‌య్ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా.. భారీ ఓపెనింగ్స్ వ‌స్తాయి. అది విజ‌య్ క్రేజ్‌. అస‌లు యావ‌రేజ్ టాక్‌తోనే విజ‌య్ భీభ‌త్స‌మైన వ‌సూళ్లు రాబ‌డ‌తాడు. తాజాగా విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ సినిమా భారీ అంచ‌నాల‌తో బాక్సాఫీస్ బ‌రిలోకి దిగింది. రెండు వ‌రుస హిట్ల‌తో మంచి ఫామ్‌లో ఉన్న లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఆరేడు నెలల క్రిత‌మే షూటింగ్ పూర్తి చేసుకుంది.

వాస్త‌వంగా ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని అనుకున్నా.. భారీ బ‌డ్జెట్ కావ‌డంతో పాటు చివ‌ర‌కు విజ‌య్ స్వ‌యంగా చొర‌వ తీసుకుని తమిళ‌నాడు సీఎం ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామిని కలిసి అనేక చ‌ర్చ‌ల త‌ర్వాత థియేట‌ర్ల‌లోనే వ‌దిలారు. విజ‌య్‌కు విల‌న్‌గా మ‌క్క‌ల్ సెల్వం విజ‌య్ సేతుప‌తి న‌టించ‌డం కూడా సినిమాపై భారీ హైప్‌కు కార‌ణ‌మైంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సంక్రాంతి కానుక‌గా ఈ నెల 13న రిలీజ్ అయిన మాస్ట‌ర్‌.. హిందీ వెర్ష‌న్ మాత్రం 14న రిలీజ్ అయ్యింది.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ట‌ర్‌కు ప్లాప్ టాక్ వ‌చ్చింది. సినిమా క‌థ‌, క‌థ‌నాలు గొప్ప‌గా లేక‌పోవ‌డంతో పాటు ర‌న్ టైం ఏకంగా మూడు గంట‌ల పాటు ఉండ‌డం కూడా మైన‌స్ అయ్యింది. విచిత్రం ఏంటంటే సినిమాకు ప్లాప్ టాక్ వ‌చ్చినా రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే ఓపెనింగ్స్‌తో ట్రేడ్ వ‌ర్గాల‌ను.. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తో కూడా తొలి రోజే 80 శాతం వసూళ్లను అందుకున్న మాస్ట‌ర్‌.. రెండో రోజు ఏకంగా రు. 1.62 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది.

ఇక ఈ సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు క్రాక్ - రెడ్ - అల్లుడు అదుర్స్ ఉన్నా కూడా .. వీటి పోటిని త‌ట్టుకుని మాస్ట‌ర్ ఈ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం గొప్ప విష‌య‌మే..! 

మరింత సమాచారం తెలుసుకోండి: