ఈ పరిస్థితులలో విశాఖపట్నం కు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు అచ్యుత శాస్త్రి అభిప్రాయం అంటూ ఒక మీడియా సంస్థ బయటపెట్టిన ఆయన భవిష్యవాణి ఇప్పుడు సంచలనంగా మారింది. అచ్యుత శాస్త్రీ అభిప్రాయం ప్రకారం చిరంజీవికి రాజకీయంగా రాణించే యోగం కలిగే గ్రహ గతులు లేవనీ ఆయన అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయాన్ని తాను చిరంజీవికి కూడ ఎప్పుడో చెప్పానని ఆయన ఆ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ చెపుతున్నాడు. అంతేకాదు చిరంజీవి జాతక గ్రహ చక్రంలో వీనస్ గ్రహం ఉచ్చ దశలో ఉండటంతో చిరంజీవికి కళా సాంస్కృతిక రంగాలలోనే మంచి పేరు వస్తుంది కానీ రాజకీయాలలో ఆయనకు ఎలాంటి యోగం కలిగే ఆస్కారం లేదు అంటూ తన భవిష్య వాణిని కొనసాగించాడు.
అంతేకాదు తాను చెప్పిన జోశ్యం 2009 లో నిజమైన విషయాన్ని మళ్ళీ గుర్తుకు చేస్తూ చిరంజీవి అలాంటి సాహసం మళ్ళీ చేయకపోవచ్చు అంటూ అభిప్రాయ పడుతున్నాడు. వాస్తవానికి చిరంజీవికి రాజకీయ యోగం లేదు అన్న విషయం గత సంఘటనలు ఋజువు చేసాయి. 9 సంవత్సరాలు సినిమాకు దూరంగా ఉండి మళ్ళీ నటించినా మెగా స్టార్ ను దేవుడు గా మెగా అభిమానులు ఆదరించారు. ఈ వాస్తవాలు అన్నీ చాల దూరదృష్టితో వ్యవహరించే చిరంజీవికి బాగా తెలుసు అందువల్ల చిరంజీవి తిరిగి పవన్ కళ్యాణ్ కోసం ‘జనసేన’ లోకి వస్తాడు అన్న మాటలు కేవలం జనసైనికులను ఉత్సాహ పరిచే మాటలు మాత్రమే అన్నది విశ్లేషకుల అభిప్రాయం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి