నారా కుటుంబ వారసుడు గా నారా రోహిత్ రాజకీయాలలోకి రాకుండా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలో నటించాడు. న్యూయార్క్ ఫిలిం అకాడెమీ లో నటనకు సంబంధించిన డిగ్రీ ని తెచ్చుకుని ‘సోలో’ ‘ప్రతినిధి’ ‘రౌడీ ఫెల్లో’ ‘అసుర’ ‘జ్యో అచ్యుతానంద’ లాంటి చాల సినిమాలలో నటించినా నటుడుగా గుర్తింపు వచ్చింది కానీ కమర్షియల్ హీరోగా రాణించ లేకపోయాడు.
దీనితో రోహిత్ రాజకీయాలలోకి వచ్చి తెలుగుదేశ పార్టీ సభ్యత్వం తీసుకుంటాడు అంటూ ఆమధ్య జోరుగా ఊహాగానాలు వచ్చాయి అయితే ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చలేదు నారా రోహిత్ ఎమ్ఎల్ఏ కల తీరలేదు. ఇప్పుడు ఆ విషయాలను గ్రహించి బాలకృష్ణ రోహిత్ ను ఎమ్ఎల్ఏ గా చేస్తున్నాడు. కానీ ఇది సినిమాలోని పాత్రకు మాత్రమే పరిమితం.
తెలుస్తున్న సమాచారం మేరకు బోయపాటి బాలకృష్ణల మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన కథలో ఒక పవర్ ఫుల్ ఎమ్ఎల్ఏ పాత్ర ఉందట. ఈపాత్రకు బాలకృష్ణ సూచన మేరకు బోయపాటి నారా రోహిత్ ను ఎంపిక చేసినట్లు టాక్. గతంలో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ను తీసినప్పుడు తనకు ఒక పాత్ర ఇమ్మని స్వయంగా రోహిత్ అడిగాడట. అయితే అప్పట్లో రోహిత్ కోరికను తీర్చలేని బాలకృష్ణ ఇప్పుడు తన సినిమాలో ఎమ్ఎల్ఏ పాత్ర ఇచ్చి అతడి రాజకీయ కళను కూడ తీరుస్తున్నాడు అనుకోవాలి. ఈమూవీతో అయినా రోహిత్ కు మళ్ళీ బ్రేక్ వస్తే మళ్ళీ చాల సినిమాలు ఈ నారా సినీ వారసుడుకి వచ్చే ఆస్కారం ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి