ఇక హౌజ్ లో అఖిల్ తో మోనాల్ నడిపించిన కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. అమ్మడికి ఆమె ద్వారా అఖిల్ కు మంచి క్రేజ్ వచ్చింది. హౌజ్ లో ఉన్నప్పుడే కాదు హౌజ్ నుండి బయటకు వచ్చాక కూడా వీరి రిలేషన్ షిప్ కొనసాగుతుంది. అఖిల్, మోనాల్ ఇద్దరు బిగ్ బాస్ తర్వాత కూడా వారి రిలేషన్ ను కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా తెలుగు అబ్బాయి.. గుజరాతీ అమ్మాయి అంటూ ఓ వెబ్ సీరీస్ ఛాన్స్ అందుకున్నారు.
భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న ఈ వెబ్ సీరీస్ లో అఖిల్, మోనాల్ ల జోడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా కానుంది. బిగ్ బాస్ ద్వారా వీళ్ల కెమిస్ట్రీ పాపులర్ అయ్యింది. ఈమధ్య జరిగిన బిగ్ బాస్ 4 రీ యూనియన్ ఉత్సవంలో కూడా మోనాల్ కు కాళ్ల పట్టీలు తెచ్చి ఇచ్చాడు అఖిల్. మోనాల్ కూడా అఖిల్ కు జాకెట్ ఇచ్చింది. మనోడు ఇదే ఈవెంట్ లో ఆమె కోసం మధురమైన ప్రేమ గీతాలను పాడి వినిపించాడు. మొత్తానికి అఖిల్, మోనాల్ వాళ్ల మధ్య ఉన్నది ఏమిటో కాని బిగ్ బాస్ తర్వాత కూడా వారికి అలాంటి క్రేజ్ కొనసాగుతుంది.
తెలుగు బిగ్ బాస్ లో ప్రతి సీజన్ లో ఒక హాట్ పెయిర్ వార్తల్లో నిలుస్తుంది. సీజన్ 1లో ప్రిన్స్, దీక్షా పంత్.. సీజన్ 2లో తనీష్, దీప్తి సునైన.. సీజన్ 3లో రాహుల్, పునర్నవి.. ఇక సీజన్ 4 లో అఖిల్, మోనాల్ ఇలా సీజన్ సీజన్ కు ఒక జోడీ తయారవుతుంది. అయితే ముందు 3 సీజన్లలో షో ముగియగానే ఎవరి దారి వారు చూసుకున్నారు కాని సీజన్ 4లో క్రేజీ జోడీగా ప్రేఉ తెచ్చుకున్న అఖిల్, మోనాల్ లు మాత్రం వారి కెమిస్ట్రీ కొనసాగిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి