కొంతమంది హీరోయిన్లు తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నో సినిమాలు చేస్తే గాని మంచి క్రేజ్ సంపాదించలేరు అనే విషయం తెలిసిందే. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఒక్క సినిమాతోనే ఊహించని విధంగా క్రేజ్ సంపాదించి వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాంటి కోవలోకే వస్తుంది కృతి శెట్టి.  ఉప్పెన సినిమాతో మెగా మేనల్లుడువైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన కృతి శెట్టి ఇక మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సంపాదించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇక మొదటి సినిమాతోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఇక కృతి శెట్టి నటించిన మొదటి సినిమానే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఊహించనివిధంగా ఘనవిజయం సాధించింది. ఇప్పటికి కూడా ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు భారీగా వసూళ్లు కూడా రాబట్టింది ఈ  సినిమా. అయితే ఇక ఈ సినిమా తర్వాత హీరోయిన్ కృతి శెట్టి ముంగిట వరుసగా అవకాశాలు వచ్చి వాలి పోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి కృతి శెట్టి ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమా లో నటించబోతోంది అని ప్రచారం జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే ఇటీవలే ఇది ప్రచారం మాత్రమే కాదు నిజం అన్నది అర్థమైంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ 19వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ కన్ఫార్మ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల చిత్రబృందం అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఇక ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహించనున్నారు.  అయితే మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కృతి శెట్టి ఇక ఆ తర్వాత ఎలాంటి విజయాలు సాధించ పోతుంది అన్నది కూడా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: