టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌రకొండ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఆనంద్ త‌న మొద‌టి సినిమా తోనే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఈ సినిమాలో హీరో రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరోయిన్ గా న‌టించింది. ఇక మొద‌టి సినిమా అయిన‌ దొర‌సాని తోనే ఆనంద్ మంచి కాఫీ లాంటి హీరో అనిపించుకున్నాడు. ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించలేక‌పోయిన‌ప్ప‌టికీ ఆనంద్ కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక లాక్ డౌన్ లో వ‌చ్చిన‌ మిడిల్ క్లాస్ మెలొడీస్ చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అందుకున్నాడు. ఇదిలా ఉండ‌గా ఆనంద్ దేవ‌ర‌కొండ ఇప్పుడు మ‌రో రెండు సినిమాల‌తో వ‌స్తున్నాడు. ఆయ‌న త‌న బర్డ్‌డే సంద‌ర్భంగా సోమ‌వారం రెండు కొత్త ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేశారు. ఈ రెండు కొత్త సినిమాల‌ వివరాలు చూస్తే.. మధురా శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ ఒక సినిమా ప్రకటించారు.

ఈ సినిమాకు బలరాం వర్మ నంబూరి, బాల సోమినేని చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మధురా ఎంటర్ టైన్ మెంట్స్, రోల్ కెమెరా విజువల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర కాస్ట్ అండ్ క్రూ ఎవరు అనే వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. మ‌రోవైపు ఆనంద్ దేవరకొండ అనౌన్స్ చేసిన రెండో సినిమా హై లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ బ్యాన‌ర్ లో తెర‌కెక్కుతోంది. ఈ బ్యాన‌ర్ లో ఇదే మొద‌టి సినిమా కావ‌డం విశేషం. ఈ చిత్రాన్ని కేదార్ సెలగం శెట్టి, వంశీ కారు మంచి నిర్మాస్తున్నారు. అంతే కాకుండా డెబ్యూ డైరెక్టర్ ఉదయ్ శెట్టి సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించనున్నారు. ఇక ఈ రెండు సినిమాలు ఆనంద్ దేవ‌ర‌కొండ‌కు ఎలాంటి విజయాన్నిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: