ప్రస్తతం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో
అల్లు అర్జున్ సరసన
హీరోయిన్ గా
రష్మిక మందన నటిస్తోంది. సినిమాను మైత్రి
మూవీ మేకర్స్ అనే నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రానికి క్రేజీ
డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
సుకుమార్ ఇప్పటికే
ఆర్య,
ఆర్య 2 లాంటి
బ్లాక్ బస్టర్ సినిమాలను
అల్లు అర్జున్ కు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పుష్ప పై భారీ అంచనాలున్నాయి. అంతే కాకుండా సినిమాలో
అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ పాత్రలో లారీ
డ్రైవర్ గా నటిస్తున్నారు.
అల్లు అర్జున్ ఫస్ట్ టైం ఇలాంటి పాత్రలో నటిస్తుండటం తో
సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే
సినిమా నుండి విడుదలైన
పోస్టర్ లు కూడా
సినిమా హైప్ ను మరింత పెంచేసాయి. అయితే ఈ సినిమాలో విలన్ ఎవరన్నది మాత్రం ముందు నుండి ప్రశ్నగానే మిగిలిపోయింది.
మొదట ఈ సినిమాలో విలన్ గా
తమిళ ప్రముఖ నటుడు
విజయ్ సేతుపతి నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ సమస్య కారణంగా
విజయ్ సేతుపతి ఈ చిత్రానికి నో చెప్పారట.ఆ తరవాత
తమిళ నటుడు
ఆర్య పుష్ప నటించబోతున్నాడని కూడా ఫిల్మ్
నగర్ లో టాక్ వినిపించింది. అది కూడా అఫీషియల్ అవ్వలేదు. అయితే తాజాగా ఈ ప్రశ్నకు చిత్రయూనిట్ తెర దించింది. సినిమాలో
అల్లు అర్జున్ కు విలన్ గా మలయాళ
సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ నటిస్తున్నట్టు ప్రకటించింది. ఫహద్ ఇప్పటి వరకు దాదాపు 40 సినిమాల్లో నటించి అలరించారు. అయితే తెలుగులో మాత్రం అతడికి ఇదే మొదటి సినిమా. ఇక
అల్లు అర్జున్ కు మలయాళం కూడా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఫహద్ కు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.