ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో మంది నటీనటులు ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో చాలామంది చాలా పాత్రలు వేస్తూనే ఉంటారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అనుకోని కారణాలవల్ల ఆక్సిడెంట్లకు గురి అయ్యి ,బతికినంత కాలం నడవలేని పరిస్థితి లోనే ఉన్న కొంత మంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నూతన ప్రసాద్ బాబు :
అందాల రాముడు సినిమా తో నటుడిగా పరిచయమైన నూతన ప్రసాద్ ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యావత్ జిల్లాలలో అందగాడు గా పేరు తెచ్చుకొని ,మంచి సినిమాలు చేసుకుంటూ తనదైన క్యారెక్టర్ తో ముందుకు సాగుతూ ఉండేవాడు. అయితే రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన బామ్మ మాట బంగారు బాట సినిమాలో కార్ పైనుంచి కింద పడే ఒక షార్ట్ తీయాలి.
అయితే అనుకోకుండా కారు కింద పడడంతో, అందులో ఉన్న రాజేంద్ర ప్రసాద్ తో సహా మొత్తం తప్పించుకున్నారు. కానీ నూతన్ ప్రసాద్ మాత్రం దెబ్బలు తగిలిన తర్వాత తన కాళ్ళు పనికిరాకుండా పోయాయి. అందువల్ల నడవలేకపోయాడు.
అను అగర్వాల్:
అప్పట్లో హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకొని , ప్రేక్షకుల మదిలో ముద్ర వేసుకున్న అను అగర్వాల్ స్వతహాగా మంచి అందగత్తె. తను తీసిన ఆషీకీ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అవడంతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది.మణిరత్నం తీసిన దొంగ దొంగ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పోషించి , తనదైన నటనతో మంచి గుర్తింపు సాధించింది.పాత చాలా సినిమాల్లో నటించిన జనాలు మెప్పిస్తూ వచ్చింది ఐతే అనుకోకుండా ఒకరోజు కార్ యాక్సిడెంట్ జరగడంతో ఆమె 20 రోజులపాటు కోమాలో ఉండి పోయింది.కానీ తను బ్రతకాలి అనుకున్న సమయంలో డాక్టర్లు సాయశక్తులా కృషి చేసి బతికించారు.
యాక్సిడెంట్ జరగడం తో ఆమె బాడీ పార్ట్ లో చాలా చోట్ల రాడ్లు కూడా వేసి ఉంటాయి. తనకు ఉన్న అందాన్ని కోల్పోవడంతో పాటు సినిమావకాశాలు కూడా తగ్గిపోయి, దాంతో బీహార్ లో ఉన్న కేంద్రంలో నటన నేర్చుకుంటూ ప్రస్తుతం పవర్ లిఫ్ట్ చేస్తున్నారు.
విద్యాసాగర్:
విద్యా సాగర్ ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే జంధ్యాల తీసిన చాలా సినిమాలలో మన విద్యాసాగర్ కనిపిస్తుంటాడు. అలాంటి విద్యాసాగర్ గారికి పక్షవాతం రావడంతో కాలు ,చేయి పనిచేయకుండా పోయింది. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి