అయితే ఒక మంచి నటుడి కి 5 కోట్ల రూపాయలు ఇవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదని.. పుష్ప సినిమా బడ్జెట్ తో పోలిస్తే విలన్ పారితోషికం తక్కువేనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. తన అత్యద్భుతమైన నటనా ప్రతిభతో ఎన్నో అవార్డులను గెలుచుకొని ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న పహద్ ఫాజిద్ పుష్ప లో అల్లు అర్జున్ కి విలన్ గా ఎటువంటి పర్ఫామెన్స్ చూపిస్తారో చూడాలని ఉందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తయారు చేస్తున్నారు.
ఇకపోతే ఈ చిత్రంలో మొదటిసారిగా అల్లు అర్జున్ తో రష్మిక మందన్న జత కడుతున్నారు. మూడోసారి సుకుమార్, అల్లుఅర్జున్ కాంబో పుష్ప సినిమాతో రిపీట్ కాబోతోంది. దీంతో ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. శేషాచల అడవుల్లో దొరికే ఎర్రచందనం.. దాని అక్రమంగా తరలించడం వంటి కథా నేపథ్యంలో పుష్ప సినిమా రూపొందుతోంది. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా అలరించనున్నారు. ఐతే ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ తదితర భాషల్లో ఆగస్టు 13వ తేదీన విడుదల కానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి