అయితే ప్రస్తుతం సోహైల్ ఒక మూవీలో హీరోగా చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల సమయం వరకు ఆయన ఈ మూవీ సెట్స్ లోనే సమయం గడుపుతున్నారు. అయితే ఇటీవల ఆయన సెట్స్ లో ఒకరిపై కోప్పడుతూ నానా రభస సృష్టించారు. మూవీ బృందానికి చెందిన ఓ వ్యక్తి పై చేయి చేసుకోవడానికి కూడా వెళ్లారు. అతడి అరుపులతో అక్కడి ప్రదేశం దద్దరిల్లింది. దీంతో నిర్మాత హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి సోహెల్ ని శాంతపరిచి గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే ఇదంతా చూస్తున్న హీరోయిన్ సోహైల్ చేష్టలకు బెంబేలెత్తిపోయారు. సోహైల్ మణి అనే ఒక వ్యక్తి పై చేయి చేసుకోవడానికి వెళుతుంటే ఆమె మరింత భయపడి పోయి కంటతడి కూడా పెట్టుకున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య ఫేమ్ రూపా కొడవయూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె సోహైల్ చేష్టలకు కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా షేర్ కూడా చేసింది. అయితే ఇదే వీడియోలో సోహైల్ మాట్లాడుతూ తాను గొడవ పడ్డది కేవలం హీరోయిన్ ని భయపెట్టడానికే అని.. హీరోయిన్ పై ముందస్తుగానే ప్రాంక్ చేయాలని ప్లాన్ చేసి పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశామని చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి