అయితే కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో దీనికి అనుమతి రాలేదు. దాంతో ప్లాన్ బి అప్లై చేసాడు ఈయన. కొన్ని పరిమితుల మధ్య శిల్పకళావేదికలో వకీల్ సాబ్ వేడుక ప్లాన్ చేస్తున్నారు.అనుకున్న రోజే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది కాకపోతే కరోనా నేపథ్యంలో కాస్త పరిమితుల మధ్య జరుగుతుంది. కోవిడ్ కారణంగా అభిమానులు కూడా సహకరించాలని.. కేవలం పాసులు ఉన్న వాళ్లు మాత్రమే అక్కడికి రావాలని ముందుగానే పాస్‌లో ప్రింట్ చేసారు.కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్ప కళా వేదికలో ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకకు వేలాది మంది అభిమానులు వస్తున్నారు. అయితే పాసులు లేకపోతే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
మరి శిల్ప కళా వేదిక దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది.. అక్కడ ఫోటోలు ప్రత్యేకంగా మీకోసం.పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటో హైదరాబాద్ శిల్పా కళావేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి సినిమా రావడంతో ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ రేంజ్‌లో హంగామా చేసారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి