టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎలాంటి డ్యాన్స్‌ర్ అనే విషయం అందరికీ తెలుసు. ఇక డీజే సినిమాలోని సీటీమార్ పాటకు అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు ఇప్పటికీ టాప్ లేపుతుంటాయి. అలాంటి పాట బాలీవుడ్‌లో రీమేక్ అవుతుందంటే అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్ అభిమానులు కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యారు. అయితే ఆ పాటను సల్లూ భాయ్య రీమేక్ చేస్తున్నాడని తెలిసేసరికి టాలీవుడ్ ఫ్యాన్స్ కొంత భయపడ్డారు. చివరికి వాళ్లు భయపడినంతా జరిగింది. దీంతో సల్లు భాయ్ పాటలో డాన్స్ వేయకపోగా.. వెకిలి చేష్టలతో, వింత స్టెప్పులతో పాటను ఖూనీ చేసేశాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.సల్లూ భాయ్ అంత డ్యాన్సర్ కాదు. నిజానికి ఓ మోస్తరు డ్యాన్సర్ కూడా కాదు. ఏదో అలా అలా బండి నెట్టేస్తుంటారు. అలాంటిది సీటీమార్ సినిమాను పాటను ఎంచుకోవడం ఓ సాహసమనే చెప్పాలి. చివరికి ఈ పాట టాలీవుడ్ ఫ్యాన్స్‌కు నచ్చక పోవడంతో ట్విటర్ వేదికగా.. విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక యూట్యూబ్‌లో అయితే దీనిపై ట్రోలింగ్ వీడియోలు కూడా వస్తున్నారు. ఈ వారం రోజుల్లో దాదాపు 100ల సంఖ్యలో ఇలాంటి వీడియోలు యూట్యూబ్‌లో చక్కర్లు కొట్టాయి. ఇక ట్వీట్లు లెక్క పెట్టడం కూడా కష్టమే.
అంతేకాకుండా అల్లు అర్జున్ వేసిన స్టెప్స్, సల్మాన్ వేసిన స్టెప్స్ కంపేర్ చేస్తూ.. బన్నీ వేసినవి స్టైలిష్‌గా ఉంటే.. సల్లూ భాయ్ వేసినవి ఏదో చేతకాక ఇంకేదో చేసినట్లు ఉందంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. టాలీవుడ్‌లోని అనేక సినిమాల్లోని కామెడీ క్లిప్స్ తీసుకుని ఈ స్టెప్స్ వీడియోలను ఎడిట్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. బాద్‌షా సినిమాలో నాజర్ డ్యాన్స్‌కు కుటుంబ సభ్యులంతా తిట్టే వీడియో, ఖలేజా సినిమాలో బ్రహ్మిని మహేశ్ తిట్టే వీడియో.. అబ్బో ఇలా ఎన్నో వీడియోలు ఎడిట్ చేసి పోస్టులు పెడుతున్నారు. వీటిలో కొన్ని మీకోసం మిస్ కాకుండా చూడండి.కాగా.. సల్మాన్ ఖాన్ రాధ సినిమా మే 13న థియేటర్లలోకి రాబోతోంది. అదే రోజు జీ ప్లెక్స్ ద్వారా ఓటీటీలో కూడా విడుదల కానుంది. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్ ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి