గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో స్టార్ రేజ్ నుండి పూర్తిగా వెనుకబడిన మాస్ మహా రాజ్ రవితేజ ఈ ఏడాది వచ్చిన " క్రాక్ " సినిమాతో మళ్ళీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా మాస్ మహారాజ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లను నమోదు చేసి టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇక " క్రాక్ " ఇచ్చిన సక్సస్ జోష్ ను కంటిన్యూ చేసేందుకు రవితేజ " ఖిలాడి " అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. 

దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరింగింది. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ చేస్తున్నాడని సమాచారం. ఒక పాత్ర కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఉంటే, మరో పాత్ర కాస్త నెగిటివ్ షెడ్ లో ఉంటుందని తెలుస్తుంది. ఇక టీజర్ లో కూడా మాస్ మహారాజ్ కాస్త నెగిటివ్ గానే కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇక సినిమాను ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించినప్పటికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగడంతో " ఖిలాడి " వాయిదా పడింది. 

ఈ నేపథ్యంలో ఈ మూవీని ఓ టీ టీ లో విడుదల చేస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో చిత్రబృందం స్పందించి " ఖిలాడి " విడుదల పై క్లారిటీ ఇచ్చింది. రవితేజ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం పూర్తిగా అవాస్తమని , ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి ఆస్వాదించేలా రూపొందిస్తున్నామని నిర్మాత కోనేరు సత్యనారాయణ వెల్లడించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తరువాత కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని ఆయన తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న గాలి వార్తలకు చెక్ పడింది. " క్రాక్ " వంటి సూపర్ హిట్ మూవీ తరువాత వస్తున్న చిత్రం కావడంతో " ఖిలాడి " పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: