సుకుమార్ తీసుకున్న నిర్ణయంతో
విజయ్ దేవరకొండ లబోదిబోమంటున్నారా? అని అడిగితే అవుననే సమాధానం వినిపిస్తోంది.
సుకుమార్ బన్నీతో కలిసి పుష్ప
సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ
సినిమా రెండు పార్ట్స్ గా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఐతే మొదటి పార్ట్ సినిమాకి సంబంధించి షూటింగ్ పూర్తయింది కానీ సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ ఇప్పుడే ప్రారంభం అయ్యింది. రెండవ భాగానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యే లోపు ఇంకో సంవత్సరం పట్టొచ్చు. అప్పటివరకు సుకుమార్-
విజయ్ దేవరకొండ కాంబో ప్రాజెక్టు ప్రారంభమయ్యే ఛాన్సే లేదు. దీంతో
విజయ్ కి వేరే సినిమాలకు సైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఒకవేళ వీళ్లిద్దరి కాంబో లో ఓ
సినిమా కన్‌ఫాం అయినా.. ఇంకొక సినిమాని
విజయ్ ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే
సుకుమార్ పుష్ప సెకండ్ పార్ట్ పూర్తి చేయడానికి కనీసం ఒకటిన్నర సంవత్సరాల సమయం తీసుకుంటారు. ఈలోగా
విజయ్ రెండు సినిమాలను పూర్తి చేయొచ్చు. నిజానికి
డియర్ కామ్రేడ్,
వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాపుల నుంచి బయటపడి త్వరత్వరగా ఒక మంచి హిట్ కొట్టాల్సిన అవసరం
విజయ్ కి ఉంది కాబట్టి ఆయన లైగర్ తో పాటు ఫాస్ట్ గా మరికొన్ని సినిమాలు చేయాల్సి ఉంది. ఏది ఏమైనా క్రియేటివ్
డైరెక్టర్ సుకుమార్ తో
విజయ్ ఎటువంటి
సినిమా చేస్తారో తెలియాలంటే ఇంకా చాలా సమయం వేచి చూడాల్సి ఉంటుంది.