యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫాన్స్ రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో తారక్ ఫ్యాన్స్ రకరకాల పోస్టర్లతో, వీడియోలతో ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే అనేక రకాల పోస్టర్లు తెగ ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఎన్టీఆర్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అతడి క్యారెక్టర్లు, అందులోని వేరియేషన్లను చూపిస్తూ.. ఆయా క్యారెక్టర్ల ఫోటోలను ఒక్కటిగా చేర్చి అదిరిపోయే పోస్టర్లు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటిని ఇప్పుడు చూద్దాం.

కాగా.. నందమూరి ఫ్యామిలీ అనే ట్యాగ్. తాతకు సరిసమానమైన నటన. ఇవన్నీ అతడి సొంతం. అతడికి ఎప్పుడూ దానితో అవసరం రాలేదు. వెండితెరపై నటుడిగా రాణించాలనే లక్ష్యంతో ఓ సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అతడే జూనియర్ నందమూరి తారక రామారావు. అవకాశాల కోసం అందరిలానే దర్శక, నిర్మాతలను కలుస్తూ రేయింబవళ్లు నిద్రాహారాలు లేకుండా శ్రమించాడు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగాడు. ఆ క్రమంలో సినిమా సినిమాకు తన రేంజ్‌ను పెంచుకొంటూ స్టార్ హీరోగా, యంగ్ టైగర్‌గా ఎదిగాడు.

ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌కు వ్యతిరేకులు, ప్రత్యర్థులు అంటూ ఎవరూ లేరు. ఏ హీరోతోనూ పోటీ పడడు యంగ్ టైగర్. తన సినిమాలు తాను చేసుకుంటూ హుందాతనంతో కూడిన అణకువతో వెళ్లిపోతుంటాడు. అందుకే ఎన్టీఆర్ అంటే అభిమానులకు అంత ఇష్టం. అభిమానులకే కాదు తోటి సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్‌ను ఓ నటుడిగా, స్నేహితుడిగా ఎంతగానో గౌరవిస్తారు.


ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఓ ప్రాజెక్ట్(అయిననూ హస్తినకు పోయి రావలె), అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.అయితే గతేడాదిలానే ఈ ఏడాది కూడా కరోనా కారణంగా ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉంటున్నాడు. అభిమానులను కూడా సెలబ్రేషన్స్ కోసం డబ్బులు ఖర్చు చేయవద్దని, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయమని సూచించాడు.
























మరింత సమాచారం తెలుసుకోండి: