ఎన్టీఆర్ తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. ఎన్టీఆర్ తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే ఎన్టీఆర్ బయెపిక్ విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన గురించి అనేక విషయాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాం అయ్యాయి. ఇక ఈ తరం వారికి ఎన్టీఆర్ గురించి తెలిసింది తక్కువే. అందుకే ఎన్టీఆర్ గురించిన విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్టీఆర్.. బెజవాడ గవర్నమెంటు కాలేజీలో చదివారు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడు. చదువుకునే రోజుల్లోనే ఎన్టీఆర్‌కు కళల పట్ల మక్కువ ఎక్కువ. ఆయన ఓసారి కళాశాల ఉత్సవాల్లో ఓ నాటకంలో నటించారట. అయితే అది మహిళ పాత్ర కావడం విశేషం. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి 'ససేమిరా' అన్నాడు. మీసాలతోటే నటించడం వలన అతనుకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. అప్పటి నుంచి అందరూ కాలేజీలో ఆయన్ను మీసాల నాగమ్మ అంటూ ఆటపట్టించేవారట.
ఇక ఎన్టీఆర్ మొదటి నుంచి కష్టజీవి. ఆయన విజయవాడలోని పటమటలో ఉండే రోజుల్లో పాలు కూడా అమ్మాడని చెబుతారు. పాలు అమ్మే స్థాయి నుంచి రాష్ట్రాన్ని పాలించే స్థాయికి చేరుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఈ విశేషాలు కూడా ఉంటే మరింత సమగ్రంగా ఉండేదని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఒక్క సినిమాలో అన్నీ చూపించలేరుగా.. పాపం క్రిష్ కష్టాన్నికూడా అభిమానులు అర్థం చేసుకోవాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి