కరోనా ఉపద్రవం ముంచుకొచ్చిన నేపథ్యంలో సోనూ సూద్, ప్రణీత సుభాష్ వంటి విశాల హృదయం గల నటీనటులు పేదవారికి దానధర్మాలు చేస్తూ అందరి మన్నలను అందుకుంటున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని సెకండ్ వేవ్ నేపథ్యంలో మరి కొందరు సినిమా యాక్టర్లు తమ వంతు సహాయం చేయడం ప్రారంభించారు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు నిఖిల్ సిద్ధార్థ తదితరులు ప్రజలకు సహాయం అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా తనలోని సేవా గుణాన్ని బయటపెట్టారు.
తాజాగా ఆమె 100 కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఆమె రేషన్ సరుకులను ఏర్పాటు చేస్తుండగా తీసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆమె దాతృత్వానికి ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇతరులకు సహాయం చేయగా వచ్చిన సంతృప్తి మాటల్లో వర్ణించలేనిది అని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇతరులను సహాయం చేసేలా ప్రేరేపించేందుకు మాత్రమే పూజా హెగ్డే దయాహృదయత పనులకు సంబంధించిన ఫోటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి కానీ మరేతర ఉద్దేశం తో కాదు. ఇకపోతే పూజా హెగ్డే కరోనా వైరస్ నుంచి ఇటీవలే కోలుకున్నారు. కరోనాను జయించిన అనంతరం ఆమె ఒక యోగ కోచ్ తో కలిసి శ్వాస ఎక్కువగా తీసుకునేందుకు ఊపిరితిత్తుల సామర్థ్యం ఎలా పెంచుకోవాలో ఒక యోగా సెషన్ ద్వారా తన అభిమానులకు తెలియజేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్, రణ్ వీర్ సింగ్ తో కలసి సర్కస్, సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్ కభీ దీవాలి చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఆమె సినిమాలన్నీ వరుసగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.