కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి. వచ్చేనెల నుండి షూటింగ్ లకు అనుమతులు వస్తాయి అని వార్తలు వస్తున్నప్పటికీ షూటింగ్ స్పాట్ రావడానికి టాప్ హీరోలు మీడియం రేంజ్ హీరోలు మానసికంగా ఇంకా సిద్ధపడటం లేదు. షూటింగ్ స్పాట్ లో ఉండే లైట్ బాయ్ దగ్గర నుండి స్వీపర్ వరకు ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగిన తరువాత మాత్రమే షూటింగ్ స్పాట్ కు వస్తామని హీరోలు హీరోయిన్స్ చెపుతూ ఉండటంతో ఇప్పట్లో షూటింగ్ లు ప్రారంభం అవ్వకపోవచ్చు అన్నసంకేతాలు వస్తున్నాయి.


దీనితో టాప్ హీరోల సినిమాల దర్శకులు అంతా ఖాళీగా ఉంటున్నారు. అయితే ముగ్గురు టాప్ దర్శకులు మాత్రం ఈ ఖాళీ సమయంలో కూడ పరుగులు తీస్తూ తమ భవిష్యత్ సినిమాల హడావిడిని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ‘ఆచార్య’ ఆగిపోయినప్పటికీ కొరటాల శివ నిరుత్సాహ పడకుండా జూనియర్ ఎన్టీఆర్ తో తీయబోతున్న మూవీ స్క్రిప్ట్ పై బిజీగా ఉన్నాడు.


‘పుష్ప’ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియనప్పటికీ సుకుమార్ విజయ్ దేవరకొండ తో తీయబోయే మూవీ సబ్జెక్ట్ గురించి ఆలోచనలు చేస్తున్నాడు. సినిమాలను అత్యంత వేగంగా తీసే అనీల్ రావిపూడి తన ‘ఎఫ్ 3’ మూవీ షూటింగ్ ఆగిపోయినా బాలకృష్ణతో తీయబోతున్న మూవీకి సంబంధించిన కథ చర్చలలో బిజీగా ఉన్నాడు. వీరు ముగ్గురు మాత్రమే కాదు ‘అఖండ’ సినిమా షూటింగ్ ఆగిపోయినా బోయపాటి విసుకు చెందకుండా అల్లు అర్జున్ కు ఒక కథ తయారు చేస్తున్నాడు.


‘లవ్ స్టోరీ’ విడుదల ఆగిపోయినా నిరాశ చెందకుండా ఒక టాప్ హీరోతో ఒక ఫీల్ గుడ్ సినిమా చేయాలని శేఖర్ కమ్ముల గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. వీరే కాకుండా ఇంకా చాలామంది దర్శకులు తమ సినిమాలు ఆగిపోయినా ఏమాత్రం నిరాశ పడకుండా పరిస్థితులతో పోరాటం చేస్తూ తమ టీమ్ సభ్యులతో కలిసి కొత్త కథలను ఆలోచిస్తూ వాటిని స్క్రిప్ట్ గా మార్చి హీరోలను బుట్టలో పడేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: