
దిలీప్ కుమార్ ను మే లోనే హాస్పిటల్ లో జాయిన్ చేసి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఆందోళన చెందుతోంది. ఇది ఇలా ఉంటే గత సంవత్సరమే తన ఇద్దరు బ్రదర్స్ ను కోల్పోవడంతో చాలా మనస్థాపానికి గురయ్యారు. దీనితో గత సంవత్సరం పుట్టినరోజును కూడా జరుపుకొలేదు. అప్పటి నుండి ఆ విషయం గురించే ఆలోచిస్తూ సంతోషమనే మాటే లేకుండా జీవిస్తున్నారు. ఇదేమైనా మనకు దక్కిన ఈ చిన్న జీవితానికి దేవునికి కృతజ్ఞులై ఉండాలని తన భార్య సైరా భాను తెలిపారు.
దిలీప్ కుమార్ తన సినిమా జీవితాన్ని 1944 లో జ్వార్ భాటా అనే చిత్రంతో స్టార్ట్ చేశారు. ఆ తరువాత 1947 లో వచ్చిన జుగ్ను చిత్రం ద్వారా మంచి పేరు వచ్చింది. దిలీప్ కుమార్ నటించిన చిత్రాలలో జోగన్, బాబుల్, ఆజాద్, దీదార్, ఆన్, కర్మ, ఫుట్ పాత్, డాగ్, దేవదాస్, మొఘల్ ఎ ఆజామ్ లు ఉన్నాయి. కాగా దిలీప్ కుమార్ తన జీవితానికి పుల్ స్టాప్ పెట్టింది ఖిలా అనే సినిమాతో, ఇది 1998 లో వచ్చింది. దిలీప్ కుమార్ ఆరోగ్యం త్వరగానే కుదుటపడి ఇంటికి తిరిగి రావాలని కోరుకుందాం.