బుల్లెట్ భాస్కర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలియనిది కాదు.  జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా ఒక సాదా సీదా కమిడియన్ గా కెరీర్ ప్రారంభించాడు భాస్కర్   ఇక ఆ తర్వాత ఏకంగా టీం లీడర్ స్థాయికి ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ప్రతీ వారం కూడా సరికొత్త స్క్రిప్టు బుల్లెట్ భాస్కర్ తనదైన శైలిలో అలరిస్తూ ఉంటాయి. ప్రతి జబర్దస్త్ ఎపిసోడ్ లో  బుల్లెట్ భాస్కర్ స్కిట్స్ లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.. అయితే జబర్దస్త్ టీం లీడర్ బుల్లెట్ భాస్కర్ కేవలం కమెడియన్ మాత్రమే కాదు ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న విషయం కూడా తెలుగు ప్రేక్షకులకు తెలుసు.




 సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ను అచ్చుగుద్దినట్టు గా దింపేస్తే ఉంటాడు బుల్లెట్ భాస్కర్. కేవలం మహేష్ బాబు వాయిస్ మాత్రమే కాదు మరి కొంతమంది నటులకు సంబంధించిన వాయిస్ ను మిమిక్రి చేస్తూ ఉంటాడు.  ఇలా ఒక వైపు జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ చేసే కామెడీ కి మాత్రమే కాదు.. అతని మిమిక్రీకి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.  జబర్దస్త్ లో అలరిస్తున్న బుల్లెట్ భాస్కర్ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమం కూడా తనదైన శైలిలో కామెడీ చేస్తూ  ప్రేక్షకులను అలరిస్తున్నాడు . ఇక ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన సోషల్ మీడియా లో విడుదలైంది.




 ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతుంది. ఈ ప్రోమో చూసిన ప్రతి ఒక్కరు ఇక ఈ వారం కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పక్క అని ఫిక్స్ అవుతున్నారు. ఇక ఈ ప్రోమో లో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ తండ్రులు శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ షో స్టేజ్ మొత్తం కళకళలాడిపోతోంది.  ఇక జబర్దస్త్ కమెడియన్స్ తమ తండ్రుల గొప్పతనాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే  బుల్లెట్ భాస్కర్ తండ్రి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే  బుల్లెట్ భాస్కర్ అలా ఉంటుందో అతని తండ్రి వాయిస్ కూడా అచ్చుగుద్దినట్టు గా ఉంది.  బుల్లెట్ భాస్కర్ తండ్రి మాట్లాడుతున్న సమయంలో అసలు మాట్లాడుతున్నారూ అన్నది  ఎవరో కూడా అర్థం కాని పరిస్థితి. బుల్లెట్ భాస్కర్ తండ్రి వాయిస్ అచ్చం అతనిలాగే ఉండడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: