మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం మరియు కం బ్యాక్ సినిమా గా తెరకెక్కిన చిత్రం ఖైదీ నెంబర్ 150. రాజకీయాల్లో నుంచి తప్పుకున్న తర్వాత ఆయన చేస్తున్న ఈ సినిమా తో ఓ రకంగా సెకండ్  ఇన్నింగ్స్  మొదలుపెట్టారు అని చెప్పొచ్చు. తన కం బ్యాక్ చిత్రం బాగుండాలనీ, మునుపటిలా ప్రేక్షకులు అలరింపబడాలని చెప్పి చాలా కథలు విని మరి ఈ తమిళ సినిమా రీమేక్ ఎంచుకున్నారు. మాస్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో విజయ్ హీరోగా కత్తి అనే పేరుతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. 

దాదాపు తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత తిరిగి సినీ రంగంలోకి చిరంజీవి ప్రవేశిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ద్వారానే మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కూడా పరిచయమయ్యారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. తొలిరోజు 50 కోట్ల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా రెండు రోజుల్లోనే వంద కోట్ల మార్కు చేరుకుంది. మొత్తంగా 164 కోట్ల వసూళ్లు సాధించి ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది. 

కేవలం 50 కోట్ల రూపాయల తోనే తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల లాభంతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ కథనం, సాయి మాధవ్ బుర్రా డైలాగులు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం తోడై బాస్ కి మరువలేని హిట్ ఇచ్చాయి. రైతుల కోసం పోరాటం చేసే వ్యక్తిగా చిరంజీవి మంచి నటన కనబరిచారు. ఇంకొక పాత్రలో దొంగ గా తనదైన స్టైల్ లో నటించారు. డ్యూయల్ రోల్ లో చిరంజీవి మరొకసారి నటించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: