జూలై ఫస్ట్ నుండి ధియేటర్లు మళ్ళీ తెరవడానికి అనుమతులు లభిస్తాయి అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. దీనితో ధియేటర్లు తెరిచిన తరువాత మొదటి సినిమా ఎవరిది కాబోతోంది అన్నచర్చలు అప్పుడే మొదలైపోయాయి. తెలుస్తున్న సమాచారంమేరకు ‘వకీల్ సాబ్’ మూవీని తిరిగి 300 వందల ధియేటర్లలో రీ రిలీజ్ చేయడానికి పక్కా ప్లాన్ దిల్ రాజ్ సిద్ధం చేసాడు అని మాటలు వినిపిస్తున్నాయి.

గత సంవత్సరం కూడ ఇదే విధంగా కరోనా ఫస్ట్ వేవ్ తరువాత ధియేటర్లు తిరిగి తెరుచుకున్నప్పుడు దిల్ రాజ్ తన ‘వి’ మూవీని రిలీజ్ చేసాడు. అయితే అప్పటికే ఓటీటీ లో విడుదలై కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ లో చూసిన ఈమూవీని మళ్ళీ ధియేటర్లలో చూడడానికి ఎవరు ఆశక్తి కనపరచకపోవడంతో ఖాళీ ధియేటర్లు మిగిలాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరాభవం ‘వకీల్ సాబ్’ మూవీకి కలుగుతుందా అన్న టెన్షన్ లో పవన్ అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది.

‘వకీల్ సాబ్’ మూవీ ఇప్పటికే ఒకసారి ధియేటర్లలో విడుదలై ఆతరువాత వెనువెంటనే అమెజాన్ లో స్ట్రీమ్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆమూవీని కోట్లాదిమంది చూడటమే కాకుండా ఓటీటీ టాప్ వ్యూయింగ్ లిస్టులో 7వ స్థానాన్ని పొందింది. అలాంటి సినిమాను ఇప్పుడు మళ్ళీ ధియేటర్లలోకి విడుదల చేస్తే మళ్ళీ ప్రేక్షకులు వస్తారా అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి.

వాస్తవానికి ‘వకీల్ సాబ్’ మూవీ మంచి కలక్షన్స్ తో రన్ అవుతుండగానే కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు వల్ల ధియేటర్లు మూత పడటంతో ఆమూవీ ప్రదర్శన ఆగిపోయింది. దీనితో ఈమూవీని భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లకు పూర్తిగా వారి డబ్బు రికవరీ కాలేదు అన్న అభిప్రాయం ఉంది. దీనితో ఆ బయ్యర్లను సంతృప్తిపరచడానికి దిల్ రాజ్ ఇలా ‘వకీల్ సాబ్’ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు భావించాలి. అయితే ధియేటర్లలో ఈమూవీని చూడటానికి కనీసం పవన్ వీరాభిమానులైనా వస్తారా అన్నది సందేహమే..




మరింత సమాచారం తెలుసుకోండి: