తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలలో అప్పటి వరకు వచ్చిన ప్రేమకథ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన చిత్రం ప్రేమిస్తే. 2004 లో తమిళ్ లో విడుదలైన కాదల్ మూవీకి ఇది తెలుగు డబ్ మూవీ. ఈ సినిమా కథ ఒక విషాద ప్రేమకథ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన మురళి (భరత్) మరియు ఐశ్వర్య (సంధ్య) లు తమ నటనతో సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లారు. ఒక స్కూటర్ మెకానిక్ పాత్రలో నటించిన భరత్ తన పాత్రలో జీవించాడు. అంతే కాకుండా సంధ్య నటన చూసిన ఎవరైనా ఈమెకు ఇదే మొదటి సినిమా అంటే నమ్మరు. అంతలా తన పాత్రలో జీవించింది. ఈ సినిమా కథ అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాలో ఎమోషన్ కి ప్రత్యేక అభినందనలు చెప్పాలి. వారిద్దరి మధ్య సినిమా మొదట్లో చూపించిన కొంటె ప్రేమకథ బాగుంది. నిజమైన ప్రేమ త్యాగం కోరుకుంటుంది. అదే విధంగా తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పరిస్థితులకు లోబడి వదిలేయవలసి వస్తుంది. ప్రేమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న హీరో పిచ్చివాడిగా మారిపోతాడు. ఆ సీన్ లలో భరత్ నటన హైలైట్. డైరెక్టర్ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా అనిపించింది.
 "ప్రేమిస్తే" మూవీ గురించి తెలియని కొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నాను.

* ఇది వాస్తవంగా మధురై నగరంలో జరిగిన కథ ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా కావడం విశేషం. ఈ చిత్ర దర్శకుడు బాలాజీ శక్తివేల్ ట్రైన్ జర్నీ లో కలిసిన ఒక వ్యక్తి చెప్పిన కథే ఈ ప్రేమిస్తే. అతనెవరో కాదు ఆ కథలోని అమ్మాయి భర్త. ఇదే కథను మన కళ్ళ ముందు కదలాడేలా చిత్రీకరించి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు.
* ఇందులో ప్రధాన పాత్రలలో నటించి ప్రేక్షకులను కంట తడి పెట్టించిన హీరోయిన్ సంధ్యకు ఇదే మొదటి సినిమా.

* తమిళ్ లో ఘన విజయం సాధించిన కాదల్ మూవీని తెలుగులో డబ్ చేశారు. ఆ తరువాత మొత్తం ఆరు భాషలలో ఈ సినిమాను రీమేక్ చేయడం విశేషం. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఒక చిన్న సినిమా ఇంత ప్రజాధరణ పొందిందంటే దానికి కారణం వాస్తవ కథను అంతే పర్ఫెక్ట్ గా స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడం.

* ఈ సినిమాలో హీరో పాత్రకు మొదటగా ధనుష్, సంతాన్ భాగ్యరాజ్ లను అడుగగా వారు ఈ కథకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఒక రేంజ్ లో ఉన్న హీరో రామ్ పోతినేనిని కూడా ఈ హీరో పాత్ర కోసం ఆడిషన్ చేశారంటే నమ్మగలరా ? చివరికి అప్పటికే బాయ్స్ సినిమాలో నటించి మంచి జోష్ లో ఉన్న భరత్ ను హీరోగా ఎంపిక చేశారు.

* మరియు ఈ సినిమాలో చాలా ముఖ్యమైన హీరోయిన్ పాత్రకు ఇలియానా మరియు వరలక్ష్మి శరత్ కుమార్ లను నటింపచేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, అవేమీ ఫలించలేదు. ఆ తర్వాత దిండిగల్ లోని తొమ్మిదవ తరగతి చదువుతున్న శరణ్య నాగ్ ని హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది. సంధ్య చదువుతున్న స్కూల్ దిండిగల్ ప్రాంతంలోనే ఈ సినిమాలోని కొంతభాగం షూటింగ్ జరిగింది.
 
* చిన్న సినిమాగా వచ్చి కమర్షియల్ గా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.

* ఈ సినిమాను కేవలం 1.25 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించగా, ఒక్క చెన్నై నుండి పెట్టిన పెట్టుబడిని కలెక్ట్ చేసింది ఇక తెలుగు డబ్బింగ్ మరియు ఇతర బాషల రీమేక్ హక్కులపై వచ్చిన ఆదాయంతో చూసుకుంటే నిర్మాతలకు మంచి లాభాల్నే తెచ్చి పెట్టింది.
* ఈ సినిమా డైరెక్టర్ బాలాజీ శక్తివేల్ కి ఇది రెండో సినిమా కావడం విశేషం. మొదటి సినిమాను చియాన్ విక్రమ్ హీరోగా సమురాయ్ తీశాడు. కానీ ఈ చిత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రేమిస్తే సినిమాతో మొదటి హిట్ కొట్టాడు.

 
* మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ప్రారంభం చేయడం జరిగింది. మరియు అక్కినేని నాగార్జున పుట్టినరోజు కానుకగా తెలుగు పాటల రికార్డింగ్ ను స్టార్ట్ చేయడం జరిగింది.

సినిమా ఎప్పటికీ యువకుల మనసులో ఒక మంచి ప్రేమకథా చిత్రంగా నిలిచిపోతుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: