టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు వచ్చి ఒకటి, రెండు సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించి ఆ తర్వాత కనుమరుగైపోయారు. వారికి అదృష్టం కలిసి రాక కొన్ని సినిమాలకే పరిమితమై ఆ తర్వాత ఇతర భాషల్లోకి వెళ్లిపోయారు. అలా 2008లో తెలుగులో కొత్త బంగారు లోకం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మా శ్వేతాబసుప్రసాద్ తెలుగు లో పెద్దగా రాణించలేకపోయింది.. తొలి చిత్రం సూపర్ హిట్ అయినా ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాల్లో నటించినా కూడా అదృష్టం కలిసిరాక ఆ సినిమాలు హిట్ అయినా కూడా ఆమెకు పేరు రాలేదు.

తెలుగు తమిళ భాషల్లో కలిపి మొత్తం ఆమె ఎనిమిది సినిమాలు చేసింది. ఇంకా  కొన్ని టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో కూడా నటించింది. హీరోయిన్ గా రాణించకపోయినా  ఆమె తన నటనతో ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. 2002లో మద్ది లో ఆమె నటనకు ఉత్తమ బాల కళాకారిణిగా జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకుంది. శ్వేతా బసు ప్రసాద్ జంషెడ్పూర్ జార్ఖండ్ లో జన్మించగా ఆమె చిన్నప్పుడే కుటుంబంతో కలిసి ముంబై వలసపోయారు. తెలుగులో ఆమె నటించిన ఆఖరి చిత్రం కళావర్ రాజు. .

తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసి ఆమె క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక సినిమాలు తగ్గిపోతున్నాయి అనుకున్న టైం లో ఆమె వివాహం చేసుకుంది అయితే భర్త నుంచి విడిపోయి మళ్లీ సినిమాల్లోకి రావడానికి ప్రయత్నిస్తోంది. ఆ మధ్య మరీ ఎక్కువ బరువు అనిపించిన ఈ అమ్మడు తాజాగా కాస్త బరువు తగ్గినట్లు ఆమె రిలీజ్ చేసిన ఫోటోలను బట్టి తెలుస్తోంది. శ్వేతాబసుప్రసాద్ మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. బరువు తగ్గి జీరో సైజు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ పై మన టాలీవుడ్ ఓ కన్ను వేస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: