రామ్ గోపాల్ వర్మ..  ఈ పేరుకి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తన సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు కొట్టి హాట్ టాపిక్ గా మారి  పోయిన రాంగోపాల్ వర్మ.. ఇక ఇప్పుడు వివాదాస్పద సినిమాలతో  హాట్ టాపిక్ గా మారిపోయారు. ప్రస్తుతం ఎన్నో రకాల వివాదాస్పదమైన సినిమాలు తెరకెక్కించి రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే అటు సోషల్ మీడియాలో కూడా వర్మ ఎప్పుడు ఎవరిని ఏకిపారేస్తాడో అన్నది ఊహకందని విధంగా ఉంటుంది.



 ఒకసారి వర్మ సోషల్ మీడియాలో ఏదైనా ట్విట్ పెట్టాడు అంటే అది సోషల్ మీడియాను ఊపేస్తు ఉంటుంది. అటు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులనే కాదు కేంద్రంలో ఉన్న మోదీని సైతం తన ట్వీట్ తో ఏకిపారేస్తు  ఉంటాడు రాంగోపాల్ వర్మ   అందుకే వర్మ ట్వీట్ లకు సోషల్ మీడియాలో తెగ క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు మరో సారి మోడీని ఉద్దేశిస్తూ ట్విట్ చేసిన రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశాడు.  ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం మన దగ్గర ఉంది.. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం మన దగ్గర ఉంది.. ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ర్యాలీలు కూడా మనవే.. ప్రపంచంలోనే అతి పెద్ద మత  కార్యక్రమాలు కూడా మనవే.. కానీ మన దగ్గర కరోనా సెకండ్ వచ్చినప్పుడు చిన్న వైద్య సదుపాయాలు కూడా లేవు.. మరి థర్డ్ వేవ్ లో అయిన  బెటర్ గా ఉంటాయా మోడీ గారు అంటూ రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో చేసిన ట్వీట్ నెట్టింట్లో లో చక్కర్లు కొడుతోంది. గత కొన్ని రోజుల నుంచి ట్విట్టర్లో రాజకీయ నాయకుల పై కామెంట్ చేయకుండా.. కాస్త సైలెంట్ గానే ఉన్న వర్మ.. ఇక ఇటీవల సెన్సేషనల్ ట్విట్ తో తెర మీదికి వచ్చి మోడీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv