టాలీవుడ్ లో హీరో శ్రీకాంత్ కి ఉన్న గుర్తింపు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అయిన శ్రీకాంత్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమా లో నక్సలైట్ గా కనిపించి తెలుగుతెర అరంగేట్రం చేసిన శ్రీకాంత్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపుతో పాటు అవార్డులు కూడా అందుకున్నాడు. ఆయన చేసిన మహాత్మ సినిమాకి గాను నంది అవార్డు స్పెషల్ కేటగిరీలో దక్కింది.

శంకర్ దాదా ఎం బి బి ఎస్ సినిమా లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. సరైనోడులో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సైమా అవార్డును అందుకున్నారు. శ్రీకాంత్ ప్రస్తుతం హీరో అవకాశాలు లేకపోవడంతో విలన్  పాత్రలనూ చేస్తున్నారు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా శ్రీకాంత్ తన విలనిజాన్ని చూపించబోతున్నారు. 

ఇక ఆయన పర్సనల్ విషయానికి వస్తే శ్రీకాంత్ టాలీవుడ్ హీరోయిన్ ఊహ ను ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆయనకు రోషన్, రోహన్, మేధా ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద పెద్ద హీరోల సపోర్టుతో శ్రీకాంత్ అంచలంచలుగా ఎదిగగా ఆయన తమ్ముడు అనిల్ కూడా సినిమా హీరో అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. కాకపోతే ఆయన ఒకటే సినిమాలో నటించాడు. ఆ సినిమానే ప్రేమించేది ఎందుకమ్మ. అయితే అంతగా సక్సెస్ కాకపోవడంతో తర్వాత నిర్మాతలు అనిల్ తో  సినిమాలు చేయడానికి ముందుకు రాకపోవడంతో హీరోగా కంటిన్యూ చేయలేకపోయాడు. దాంతో చిత్రసీమను వదిలి వెళ్ళక తప్పలేదు. అయితే నిర్మాతగా మారి శ్రీకాంత్ తో విరోధి అనే సినిమా నిర్మించాడు. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇటు హీరోగా నిర్మాతగా సక్సెస్ కాకపోవడంతో సినిమాలకు పుల్ స్టాప్ పెట్టాడు అనిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: