టాలెంటెడ్ యాక్ట్రెస్ తాప్సీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. అనతి కాలంలోనే సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అగ్రతారగా ఎదిగారు. అంతేకాదు కథాబలం ఉన్న బాలీవుడ్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు దక్కించుకున్నారు. పింక్, బద్లా, తప్పడ్‌ వంటి బాలీవుడ్ సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న రోల్స్ లో చక్కగా ఒదిగిపోయి యావత్ భారతదేశ ప్రేక్షకులను ఆమె ఫిదా చేశారు. తెలివిగా తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ రోజు ఆమె బాలీవుడ్ చిత్ర సీమ లో అగ్రతారగా ఎదగ గలిగారు. ఒకవైపు కమర్షియల్ ఫిలిమ్స్ చేస్తూనే మరోవైపు మంచి పాత్రల కోసం ఆమె అన్వేషిస్తుంటారు.


అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరొక కథాబలం ఉన్న సినిమాని సెలెక్ట్ చేసుకున్నారని తెలుస్తోంది. సైంటిఫిక్ ఫిక్షన్ జానర్ లో రూపొందనున్న పాన్ ఇండియా సినిమా "ఏలియన్ (వర్కింగ్ టైటిల్)" లో ఆమె నటించేందుకు పచ్చజెండా ఊపారు. అయితే టైటిల్ "ఏలియన్" అయినప్పటికీ.. హాలీవుడ్ సన్నివేశాల్లాగా ఈ సినిమాలో గ్రహాంతర సన్నివేశాలు ఉండవని.. ఈ సినిమాలోని గ్రహాంతర వాసులకు సంబంధించిన సన్నివేశాలు చాలా భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. ఇండియాలో గ్రహాంతరవాసులు ఉంటే అవి ఎలా ఉంటాయి? వంటి ఆలోచనతో ఈ సినిమా రూపొందనుందని సమాచారం.



అయితే ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ కోసం అక్షరాలా పది కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే ఇటువంటి డిఫరెంట్ సినిమాలో నటించేందుకు తాప్సీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాస్తవానికి ఇలాంటి సినిమాల్లో నటనకు చాలా ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఈ విషయాలన్నీ ఆలోచించిన తర్వాతనే తాప్సీ సైన్ చేశారని తెలుస్తోంది. ఏలియన్ కాన్సెప్ట్ తో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ భారత చలన చిత్ర పరిశ్రమలోనే ఏలియన్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. అయితే దర్శకుడు భరత్ నీలకంఠన్ మాత్రం భారీ బడ్జెట్ తో అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక ఏలియన్ సినిమాను రూపొందించేందుకు రెడీ అయ్యి అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: