టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో నే కాకుండా సమాజ సేవ పరంగా కూడా దూసుకు వెళుతున్నాడు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఆయన స్థాపించిన దేవరకొండ ఫౌండేషన్ సంస్థ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్స్ అనే ఛారిటీ ని ప్రారంభించి మిడిల్ క్లాస్ కుటుంబాలకు కరోనా క్రైసిస్ లో ఎంత సేవ చేశారు. వారికి కావలసిన కిరాణా సరుకులు అందించి వారిలో కొంత కష్టాన్ని తీర్చారు.

అలాగే ఈ సంస్థ ద్వారా ఉద్యోగాలు కూడా ఇస్తూ విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు చాలా మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అందించిన ఈ సంస్థ భవిష్యత్తులో మరింత మందికి ఈ ఫౌండేషన్ ద్వారా ఉద్యోగాలు అందించబోతుంది అని వెల్లడించారు. హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు విజయ్ దేవరకొండ. సినిమాలు చేసి తన పని తాను చూసుకోకుండా తను నమ్మిన అభిమానుల కోసం ఆదరించిన ప్రేక్షకులకు కోసం సమాజ సేవ చేయడం ఇతర హీరోలకు కూడా ఆదర్శంగా నిలిచింది. 

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత గీత గోవిందం సినిమా తో హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు విజయ్ దేవరకొండ. మరి ఈ పాన్ ఇండియా మార్కెట్ లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత అయన సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకేక్కుతుండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: