తొలిసినిమా వైఫల్యంతో ఎస్.వి.రంగారావు ఇక తాను సినిమాల్లో పనికిరానని అనుకున్నారు. దాంతో జంసెడ్పుర్ కు వెళ్లి అక్కడ టాటా కంపెనీ లో ఉద్యోగం లో చేశారు. కానీ మళ్లీ సినిమా మీద మక్కువతో ప్రేమతో తిరిగివచ్చి సినిమాలలో నటించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆయన వరుస సినిమా లు చేయగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ రోజు ఆయన అలా మనసు మార్చుకోకు పోయి ఉంటే ఈరోజు ఒక గొప్ప నటుడిని తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయేది. పాతాళ భైరవి, మాయ బజార్ నర్తనశాల వంటి చిత్రాలతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందగా ఎస్వీ రంగారావు తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన ఆణిముత్యాలలో లో ఒకరు.

జూలై 18, 1974 వ సంవత్సరం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక దుర్డినమని చెప్పవచ్చు. రంగారావు గారు గుండెపోటుతో కన్నుమూసిన రోజు అది. ఆ ఏడాది ఫిబ్రవరిలో ఆయనకు తొలిసారిగా గుండెపోటు వచ్చింది. అప్పుడు రంగారావు గారు హైదరాబాద్ లోని బ్లూ మూన్ హోటల్ లో ఉండగా నిర్మాత ఆదిశేషగిరిరావు అదే సమయంలో అక్కడికి వెళ్ళగా గుండెల్లో నొప్పి రావడంతో ఆయన హాస్పిటల్లో చేర్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు యశోద కృష్ణ చిత్రంలో నటించే అవకాశం రంగారావుకు వచ్చింది. అందులో కంసుడి పాత్ర పోషించాలని ఆయన ముచ్చటపడ్డారు. డాక్టర్లు రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చినా కూడా వినిపించుకోలేదు. 

అలా మైసూర్ కి వెళ్లి చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారు.  అవుట్ డోర్ షూటింగ్ చేయడం వల్ల అది ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఆ విధంగా ఆయన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా సినిమాలలో నటించే వారు. ఇక జూలై 18న ఆయన షూటింగ్ కి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నారు. భోజనం చేసి కాసేపు పడుకుందామని పడుకున్నారు. సాయంత్రం నాలుగున్నరకు లేచి బాత్రూంకి వెళ్లి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా మంచం మీద తూలి పడ్డారు. మళ్లీ ఆయన లేవలేదు. రంగారావు పర్సనల్ డాక్టర్ బాలకృష్ణకు కబురు చేయగా ఆయన వచ్చి చూస్తే నాడి అందలేదు.  ఎందుకైనా మంచిదని హాస్పిటల్ కు తీసుకువెళ్లగా ప్రాణం పోయిందని నిర్ధారణ చేశారు. అలా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం లేకుండానే రంగారావు మరణించడం విషాదకరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

SVR