లైగర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి త్వరలోనే విజయ్ దేవరకొండ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాడు. ఓకే ఒక షెడ్యూల్ బ్యాలెన్స్ ఉందని త్వరలోనే అది కూడా కంప్లీట్ చేసి సినిమా విడుదల చేస్తామని ఆయన తెలిపారు.  ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించడం,పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల అవుతుండటంతో దేశమంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది.  ఇకపోతే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని గతంలోనే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అయితే తాజాగా ఓ వార్త నెట్టింటా హల్ చల్ చేస్తుంది.  సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఒకే పార్ట్ గా విడుదల అవుతుందని అనుకున్నారు కానీ షూటింగ్ సమయంలో లెంత్ బాగా పెరిగిపోవడంతో సుకుమార్ ఈ సినిమానీ రెండు పార్ట్ లు గా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ నిర్ణయం విజయ్ దేవరకొండ సినిమా పై కొంత ప్రభావం చూపిందని తెలుస్తుంది. 

మొదటి పార్ట్ విడుదల అయిన తర్వాత రెండవ పార్ట్ తీసే సమయంలో డీవియేశన్ రాకూడదని పుష్ప 2 ను అలానే కంటిన్యూ చేయాలని భావించారట సుకుమార్. అయితే విజయ్ దేవరకొండ సినిమాకి కొంత గ్యాప్ ఏర్పడడంతో ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ తో సినిమా చేయాలని ఆయన భావించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. మరోవైపు నవీన్ పోలిశెట్టి అనుష్క శెట్టి ల సినిమా లో కూడా విజయ్ కీలకపాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిలో ఏవి నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: